మొయినాబాద్ పాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో మరో ఐదుగురికి సిట్ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో మరో ఐదుగురికి సిట్ శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన జగ్గుస్వామి ఆయన సోదరుడు మణిపాల్ , జగ్గుస్వామి ఆశ్రమంలో పనిచేసే శరత్ , ప్రశాంత్ లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.
బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కి నిన్ననే సిట్ నిన్ననే నోటీసులు జారీ చేసింది. బీఎల్ సంతోష్ కి 41ఏ సీఆర్‌పీసీ కింద మరోసారి నోటీసులు జారీ చేయాలని సిట్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో నిన్ననే బీఎల్ సంతోష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జగ్గుస్వామి ఆశ్రమంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బీజేపీ నేత తుషార్ కు రామచంద్రభారతికి జగ్గుస్వామి మధ్యవర్తిగా ఉన్నాడని సిట్ గుర్తించింది. తెలంగాణ నుండి సిట్ బృందం వస్తుందని సమాచారం తెలుసుకున్న జగ్గుస్వామి పారిపోయాడు. జగ్గుస్వామిని విచారణకు రావాలని కూడా సిట్ నోటీసులు జారీ చేసింది.
అయితే జగ్గుస్వామి విచారణకు రాలేదు. దీంతో జగ్గుస్వామికి మూడు రోజుల క్రితం సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో బీఎల్ సంతోష్ ను విచారిస్తే కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తుంది. సిట్ విచారణకు రావాలని కోరుతూ బీఎల్ సంతోష్ కు గతంలోనే నోటీసులు జారీ చేసింది.ఈ నెల 21న సంతోష్ విచారణకు రావాల్సి ఉంది. అదే రోజున తుషార్ కూడా విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ సిట్ విచారణకు సంతోష్, తుషార్, జగ్గుస్వామిలు హాజరు కాలేదు.దీంతో సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్. జగ్గుస్వామి సోదరుడితో పాటు మరో నలుగురికి సిట్ నోటీసులు పంపింది. ఇదే కేసులో ఏపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి కూడా సిట్ నోటీసులు పంపింది. ఈ నెల 29న విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది.
also read:ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... లాయర్ శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు, నిందితులతో ప్రయాణాలపై ఆరా
గత నెల 26న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ముగ్గురు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యేల గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని ఈ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.