టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు:ఆ ముగ్గురికి 41 ఎ సీఆర్‌పీసీ నోటీసులు

By narsimha lode  |  First Published Oct 28, 2022, 10:15 AM IST

మొయినాబాద్  ఫాంహౌస్ లో  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు  ఎదుర్కొంటున్న  ముగ్గురు నిందితులకు ఇవాళ పోలీసులు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.
 


హైదరాబాద్:టీఆర్ఎస్  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురికి మొయినాబాద్  పోలీసులు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద  నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు  రావాలని  పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

మొయినాబాద్ ఫాం హౌస్  లో టీఆర్ఎస్ కు  చెందిన నలుగురు  ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి  చేశారనే  ముగ్గురిపై తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదు  మేరకు  ఈ నెల 26న రాత్రి ముగ్గురిని పోలీసులు అరెస్ట్  చేశారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజీ, హైద్రాబాద్ కు  చెందిన నందులను పోలీసులు   అరెస్ట్  చేశారు. నిన్న రాత్రి ఈ  ముగ్గురిని  పోలీసులు  సరూర్  నగర్ లో  ఉన్న  జడ్జి  నివాసంలో హాజరుపర్చారు.  అయితే  ఈ ముగ్గురిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని జడ్జి  తప్పు బట్టారు.పీడీ  యాక్ట్ వర్తించదని  జడ్జి తేల్చి  చెప్పారు. 41  సీఆర్‌పీసీ సెక్షన్ కింద  నోటీసులు ఇచ్చి విచారించాలని జడ్జి ఆదేశించారు. ఈ ఆదేశాల  మేరకు పోలీసులు  ఈ ముగ్గురికి  41  సీఆర్‌పీసీ సెక్షన్  కింద  నోటీసులు  జారీ చేశారు. ఇవాళ  విచారణకు రావాలని ఆదేశించారు.

Latest Videos

undefined

ఈ నెల26న మొయినాబాద్  ఫాం హౌస్ లో  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి  చేశారని   ఈ ముగ్గురిపై  ఆరోపణలు వచ్చాయి. తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్  రెడ్డి ఇదే విషయమై మొయినాబాద్  పోలీసులకు పిర్యాదు  చేశాడు. ఈ ఫిర్యాదు  ఆదారంగా వీరిని  పోలీసులు  అరెస్ట్ చేశారు. అయితే  నిందితులపై నమోదు చేసిన  పీడీ యాక్ట్ పై జడ్జి  ఆగ్రహం వ్యక్తం  చేయడంతో పోలీసులు   41  సీఆర్ పీసీ సెక్షన్ కింద  నోటీసులు జారీ చేశారు. 

also read:కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్: యాదాద్రికి బయలుదేరిన బీజేపీ తెలంగాణ చీఫ్

తమ  పార్టీకి  చెందిన నలుగురు  ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా  ఖండించింది. మునుగోడులో  ఓటమి  పాలౌతున్నామని భావించి  టీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారానికి  ఈ డ్రామాకు  తెరతీసిందని  బీజేపీ  తెలిపింది.. ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేయలేదని  యాదాద్రి ఆలయంలో ప్రమాణం  చేసేందుకు రావాలని బండి  సంజయ్   కేసీఆర్  కు సవాల్  విసిరారు. ఈ సవాల్  నేపథ్యంలో  మర్రిగూడ నుండి బండి  సంజయ్  యాదాద్రి  ఆలయానికి  బయలుదేరి వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో  విజయం  కోసం టీఆర్ఎస్ నేతలు  తప్పుడు  ప్రచారం  చేస్తున్నారని బీజేపీ నేతలు  విమర్శించారు. 

click me!