తెలంగాణ హైకోర్టుకి బీఎల్ సంతోష్: క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత

By narsimha lode  |  First Published Nov 25, 2022, 2:26 PM IST

తెలంగాణ హైకోర్టుకు  బీజేపీ అగ్రనేత  బీఎల్ సంతోష్  శుక్రవారం నాడు  క్వాష్ పిటిషన్ దాఖలు  చేశారు.



హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు  బీజేపీ  అగ్రనేత  బీఎల్ సంతోష్  శుక్రవారంనాడు  క్వాష్ పిటిషన్  దాఖలు  చేశారు.  నిన్ననే రెండోసారి  సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి   జారీ  41 ఏ సీఆర్‌సీపీ  కింద  నోటీసులు జారీ  చేసిన  విషయం  తెలిసిందే. రెండు రోజుల  క్రితం  తెలంగాణ హైకోర్టు  బీఎల్ సంతోష్ కి  మరోసారి  నోటీసులు జారీ  చేయాలని ఆదేశించింది.దీంతో  ఈ  కేసులో  41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ  చేశారుఈ  కేసులో బీఎల్ సంతోష్ పాటు  తుషార్, జగ్గుస్వామిలపై  కూడా   పోలీసులు  కేసు నమోదు  చేశారు. ఈ విషయాన్ని  మోమో  ద్వారా  హైకోర్టుకు  సిట్  తెలిపింది.  

ఈ  కేసులో  అరెస్టైన  నిందితులు  బీఎల్ సంతోష్ తో  మాట్లాడినట్టుగా సిట్  వాదిస్తుంది.  ఈ  కేసులో  సంతోష్ ను విచారిస్తే  కీలక  విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సిట్  చెబుతుంది. ఎమ్మెల్యేలతో నిందితులు  మాట్లాడినట్టుగా  బయటకు వచ్చినట్టుగా  ఉన్న  ఆడియోలు, వీడియోల్లో  కూడా  సంతోష్  పేరును కూడా  ఉపయోగించారు. ఈ  కేసులో  తన  పేరును తొలగించాలని  కోరుతూ  బీజేపీ  నేత  బీఎల్ సంతోష్  ఇవాళ  తెలంగాణ హైకోర్టులో పిటిషన్  దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  ఇవాళ  మధ్యాహ్నం విచారణ జరగనుంది.  

Latest Videos

undefined

ఈ  నెల  26న లేదా  28న విచారణకు  రావాలని కోరుతూ  బీఎల్ సంతోష్ కు నిన్ననే  సిట్  నోటీసులు  జారీ చేసింది.  హైకోర్టు  ఆదేశాల  మేరకు  మెయిల్  లేదా వాట్సాప్  ద్వారా  నోటీసులు  పంపాలని కోర్టు  ఆదేశించింది.  దీంతో  సిట్  నోటీసులు పంపింది.బీజేపీ  అగ్రనేత  బీఎల్ సంతోష్ కి  నోటీసులు జారీ చేయడం,  కేసులు నమోదు  చేయడంపై  ఆ పార్టీ  నేతలు  కూడా  సీరియస్  గా  ఉన్నారు.  ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ నేతపై కేసులు నమోదు  చేశారని  టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు  మండిపడుతున్నారు. న్యాయపరంగానే  ఈ  విషయాలను  ఎదుర్కొంటామని  బీజేపీ  నేత  డాక్టర్  లక్ష్మణ్  నిన్ననే ప్రకటించారు. 

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: హైకోర్టులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్

ఈ  కేసులో  సిట్  బృందం  దేశంలొని పలు  రాష్ట్రాల్లో  సోదాలు  నిర్వహించారు.  కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక  రాష్ట్రాల్లో  సోదాలు  నిర్వహించారు. కేరళ  రాష్ట్రంలోనే  ఈ కేసుకు సంబంధించి  కొంత  సమాచారాన్ని  సిట్  సేకరించిందని ప్రచారం సాగుతుంది.  రామచంద్రభారతికి తుషార్ కి మధ్యవర్తిగా  జగ్గుస్వామి వ్యవహరించినట్టుగా  గుర్తించారని  సమాచారం. జగ్గుస్వామి , తుషార్,  బీఎల్  సంతోష్ లను ఈ నెల  21న విచారణకు  రావాలని సిట్  నోటీసులు  జారీ  చేసింది. కానీ వీరెవరూ  కూడా విచారణకు  రాలేదు.  బీఎల్  సంతోష్ కు ఢిల్లీ పోలీసుల సహాయంతో  బీజేపీ  కార్యాలయంలో  పోలీసులు నోటీసులు అందించారు.  తనకు  సమయం  కావాలని  బీఎల్ సంతోష్  సిట్ కు లేఖ రాశాడు. తాజాగా పంపిన  నోటీసుపై  ఆయన  క్వాష్ పిటిషన్  దాఖలు  చేశారు. 

click me!