టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే అంశంపై ప్రత్యేక విచారణ బృందంతో దర్యాప్తు చేయించాలని బీజేపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల అంశంపై స్పెషల్ ఇవ్వేస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాలని హైకోర్టులో బీజేపీ గురువారంనాడు రిట్ పిటిషన్ దాఖలు చేసింది.తెలంగాణ పోలీసుల తీరుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. పైలెట్ రోహిత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మొయినాబాద్ ఎస్ హెచ్ఓ ,సైబారాబాద్ సీపీ సహా ఎనిమిది మందిని బీజేపీ ప్రతివాదులుగా చేర్చింది.
మొయినాబాద్ పాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురి చేసేందుకు ముగ్గురు ప్రయత్నించారనే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు బుధవారంనాడు రాత్రి మొయినాబాద్ ఫాంహౌస్ కు చేరుకున్నారు. ఈ సమయంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినకపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలున్నారు. ఈ ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీ, హైద్రాబాద్ కు చెందిన నందులు ఈ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ప్రచారం సాగుతుంది. ఈ విషయమై ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచరం మేరకు దర్యాప్తు చేస్తున్నామని బుధవారం నాడు రాత్రి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
undefined
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.రామచంద్ర భారతి, సింహయాజీ, నందులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.
ఈ అంశంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ తప్పుబడుతుంది. కొందరు పోలీసులు అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ కారణంగానే ఈ కేసు విచారణను ప్రత్యేక విచారణ బృందంతో విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కూడా ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలౌతామనే భయంతో టీఆర్ఎస్ ఈ డ్రామాకు తెరతీసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
also read:ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: బండి సంజయ్
ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం కూడ ఉన్నందున ఈ కేసు దర్యాప్తు సీబీఐతో చేయించాలని కొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎవరెవరు టచ్ లో ఉన్నారనే అంశానికి సంబంధించి కాల్ డేటాను బయటపెట్టాలని కమలం నేతలు కోరుతున్నారు. అంతేకాదు ఫాం హౌస్ ,ప్రగతిభవన్ ,నందుకు చెందిన హోటల్ సీసీటీవీని కూడ బయటపెట్టాలని బీజేపీ కోరుతుంది.ఈ పిటిషన్ పై హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి