మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తాను.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన ప్రకటన

Published : Oct 27, 2022, 02:10 PM IST
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తాను.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన ప్రకటన

సారాంశం

బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదన్నారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇక, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచన సంగతి తెలిసిందే. మునుగోడులో గెలుపే లక్ష్యంగా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. టీఆర్‌ఎస్‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి‌లు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే