ఎవరెవరికి ఎంతివ్వాలి: రామచంద్రభారతి, నందకుమార్ ,సింహయాజీల ఫోన్ సంభాషణ

By narsimha lode  |  First Published Oct 28, 2022, 4:21 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  ప్రలోభాల అంశానికి సంబంధించిన మరో ఆడియో  బయటకు వచ్చింది. ఈ ఆడియోలో  ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ఇవ్వాలనే విషయమై చర్చ జరిగింది. 


హైదరాబాద్:మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల అంశానికి సంబంధించి  శుక్రవారంనాడు  రెండో ఆడియో విడుదలైంది. ఈ ఆడియోలో  రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ల మధ్య సంభాషణ జరిగినట్టుగా ఉంది. 

ఒక్కోక్కరికి  ఎంత ఇవ్వాలనే దానిపై చర్చించుకున్నారు.నలుగురు  ఎమ్మెల్యేలు  రావడానికి  సిద్దంగా  ఉన్నారని ఈ  సంభాషణల్లో ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం  ప్రసారం చేసింది.వారు 100 ఆశిస్తున్నారని   ఆడియోలో ఉంది. 

Latest Videos

పైలెట్  రోహిత్ రెడ్డి తనతో  పాటు నలుగురికి తీసుకొచ్చేందుకు  సిద్దంగా ఉన్నారని ఈ సంభాషణల్లో ఉంది.పైలెట్  రోహిత్ రెడ్డికి 100, మిగిలినవారికి నామమాత్రంగా  ఇస్తే సరిపోతుందని ఆ సంభాషణ చెబుతుంది.రాష్ట్ర నాయకులతో  సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలిపిస్తామని చెప్పామని  ఆ  కథనం ప్రసారం  చేసింది.27 నిమిషాల  పాటు  ఈ సంభాషణ ఉందని ఈ కథనం వివరించింది.

మునుగోడు అసెంబ్లీ  ఎన్నికలకు ముందే ఇది జరిగిపోతుందని రామచంద్రభారతి అన్నట్టుగా  ఈ సంభాషణ ఉందని  ఈ  కథనం తెలిపింది.మునుగోడు ఉప ఎన్నికకు ముందే  అయితే 100కు రావడానికి వాళ్లు ఒకే అంటున్నారని  చర్చించుకున్నట్టుగా  ఉందని  ఈ  కథనం తెలిపింది.

ఈ అంశాలపై తాను సంతోష్ కు మేసేజ్ చేస్తానని  రామచంద్రభారతి  అన్నట్టుగా ఆడియోలో ఉంది.ఈ విషయమై మాట్లాడి  క్లారిటీ ఇవ్వాలని రామచంద్రభారతిని కోరినట్టుగా ఆడియో సంభాషణ ఉంది. టీఆర్ఎస్ తో  పాటు కాంగ్రెస్ పార్టీ నుండి  కూడా  చాలా మంది  రావడానికి సిద్దంగా ఉన్నారని  ఈ సంభాషణలో ఉందని  ఈ కథనం  తెలిపింది. నలుగురైదుగురు నేతలైతే నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లి మాట్లాడొచ్చని సంభాషణలో ఉంది.ఒకేసారి  నలుగురు  ఎమ్మెల్యేలు సిద్దంగా  ఉన్నారని సంభాషణ సాగింది. ఒకరిద్దరూ  ఉంటే ఢిల్లీకి తీసుకురావదం వృధా అని అభిప్రాయపడినట్టుగా ఈ కథనం  తెలిపింది.

అయితే ఈ  ఆడియో  అసలువో నకిలీవో అనే అంశం  తేలాలి. మరో వైపు ఈ ఆడియోలో మాట్లాడినట్టుగా   చెబుతున్న   రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లకు బీజేపీతో ఎలాంటి  సంబంధాలున్నాయనే విషయమై కూడా తేలాలి.  వీరి  వెనుక ఎవరైనా  ఉన్నారా అనే విషయమై దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది.

also read:ఎవరెవరు వస్తారో చెప్పండి:పైలెట్ రోహిత్ రెడ్డి, రామచంద్రభారతి ఆడియో సంభాషణ

ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి  చేసేందుకు ప్రయత్నించినట్టుగా ఆరోపణలు  ఎదుర్కొంటున్న రామచంద్రభారతి, సింహయాజీ  స్వామిజీలను తాను బీజేపీలో ఎవరితోనూ చూడలేదని  బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు  డికె  అరుణ  ఓ మీడియా చానెల్  కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  కొనుగోలు చేయాల్సిన అవసరం  తమకు లేదని బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధక్షుడు బండి సంజయ్ ,  కేంద్ర మంత్రి  కిషన్  రెడ్డి స్పష్టం  చేసిన విషయం తెలిసిందే. 
 


 


 

click me!