మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు తమకు సంబంధం లేదని యాదాద్రి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్
యాదగిరిగుట్ట:మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు తమకు సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బండి సంజయ్ శుక్రవారం నాడు ప్రమాణం చేశారు. ఇవాళ ఉదయం మర్రిగూడ నుండి బండి సంజయ్ యాదాద్రి ఆలయానికి బయలు దేరారు. మధ్యాహ్నానికి యాదాద్రికి చేరకున్నారు.
సీఎం కేసీఆర్ ను కూడ ప్రమాణం చేసేందుకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. అయితే ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ నుండి ఎలాంటి స్పందన రాని విషయాన్ని కూడ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
undefined
యాదాద్రికి చేరుకున్న బండి సంజయ్ స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలో మూల విరాట్టును దర్శించుకున్నారు. అక్కడి నుండి నేరుగా వచ్చిన స్వామివారి పాదాల వద్ద ప్రమాణం చేశారు.మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురిచేశామని తమపై టీఆర్ఎస్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది.
ఇవాళ ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తాను యాదాద్రి ఆలయం వద్ద సీఎం కేసీఆర్ కోసం ఎదురు చూస్తానని బండి సంజయ్ ప్రకటించారు. యాదాద్రికి రావాలని కూడ కేసీఆర్ ను కోరారు. ఇవాళ 10 గంటల తర్వాత మర్రిగూడ నుండి యాదాద్రికి బండి సంజయ్ బయలుదేరారు. హైద్రాబాద్ నుండి యాదాద్రికి రావాలని కేసీఆర్ నుకోరారు .తనను ఆపేందుకు పోలీసులకు సీఎంఓ నుండి ఆదేశాలు వచ్చాయన్నారు.
మర్రిగూడ నుండి భారీ కాన్వాయ్ తో బండి సంజయ్ మర్రిగూడ నుండి యాదాద్రి ఆలయానికి వచ్చి ప్రమాణం చేశారు.మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు తమ పార్టీఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీ, హైద్రాబాద్ కు చెందిన నందులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని జడ్జి తప్పుబట్టారు. నిందితుల అరెస్ట్ ను రిజెక్ట్ చేసింది.41ఎ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే రామచంద్రభారతి,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్యజరిగిన ఆడియో సంభాషణ ఇవాళ వెలుగు చూసింది. ఈ ఆడియో సంభాషణ ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఈ ఆడియో సంభాషణ మీడియాలో ప్రసారమైన తర్వాత బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు. రామచంద్రభారతి,రోహిత్ రెడ్డి మధ్య సంభాషణ నిజమైందో లేదో నిర్ధారించాల్సి ఉంది.
also read:కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్: యాదాద్రికి బయలుదేరిన బీజేపీ తెలంగాణ చీఫ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ తేల్చి చెబుతుంది. నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొంటే టీఆర్ఎస్ సర్కార్ కూలిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీలో చేర్చుకోవడానికి చేరికల కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. కానీ డబ్బులు ఇచ్చి ఎవరిని కూడ పార్టీలో చేర్చుకోబోమన్నారు. తమ పార్టీలో చేరేముందు ఇతర పార్టీల ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటున్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.