ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరైన నందకుమార్‌కి చెందిన ఫిల్మ్‌నగర్‌లో వున్న డెక్కన్ కిచెన్ హోటల్‌ని అధికారులు జేసీబీతో కూల్చివేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరైన నందకుమార్‌కి చెందిన ఫిల్మ్‌నగర్‌లో వున్న డెక్కన్ కిచెన్ హోటల్‌ని అధికారులు జేసీబీతో కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా... గత నెల 26న మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముగ్గురు నిందితులు ప్రలోభాలకు గురిచేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి లను రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఇదే విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకుపోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Also REad:ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్: హర్షవర్ధన్ రెడ్డి,రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు
ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. తమ పార్టీలో చేర్చుకోవాలంటే నేరుగా చేర్చుకొంటామని ఆ పార్టీ ప్రకటించింది.మధ్యవర్తులను పెట్టి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా బీజేపీ తేల్చి చెప్పింది.మొయినాబాద్ ఫాం హౌస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది.మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు పార్టీలు ఈ అంశంపై పరస్పరం విమర్శలు,ప్రతి విమర్శలకుదిగాయి.ఈ కేసును సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ కోరుతుంది. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ విచారణను నిలిపివేయాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.