
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. టీడీపీటీఎస్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం లిమిటెడ్ మాజీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడినై టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 25న రెండు వేల మంది కార్యకర్తలతో తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
తనతోపాటు బోధన్‌కు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రచ్చ సుదర్శన్, భూమా నాగేశ్వర్, జనార్దన్‌రెడ్డి, సత్యనారాయణ పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. తమ రాజీనామా లేఖలను టీడీపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణకు పంపించినట్లు తెలిపారు.