ఐదు రోజుల క్రితం నాలాలో పడిన మోహన్ రెడ్డి: కుత్బుల్లాపూర్ చెరువులో డెడ్‌బాడీ లభ్యం

Published : Oct 05, 2021, 01:26 PM IST
ఐదు రోజుల క్రితం నాలాలో పడిన మోహన్ రెడ్డి: కుత్బుల్లాపూర్ చెరువులో డెడ్‌బాడీ లభ్యం

సారాంశం

ఐదు రోజుల క్రితం బాలానగర్ ఐడీపీఎల్ వద్ద నాలాలో ప్రమాదవశాత్తు పడిపోయిన మోహన్ రెడ్డి మృతదేహం కుత్బుల్లాపూర్  చెరువలో ఇవాళ లభ్యమైంది. బాలానగర్ ఐడీపీఎల్ నాలాలో మోహన్ రెడ్డి ప్రమాదవశాత్తు పడిపోయి కొట్టుకుపోయాడు.

హైదరాబాద్: హైద్రాబాద్ (hyderabad )బాలానగర్ ఐడీపీఎల్ (idpl)వద్ద నాలాలో  ప్రమాదవశాత్తు పడిపోయిన మోహన్ రెడ్డి (mohan reddy)డెడ్‌బాడీ (dead body)మంగళవారం నాడు కుత్బుల్లాపూర్ నాలాలో(quthbullapur lake) లభ్యమైంది.

also read:మూసీలో కొట్టుకుపోయిన జహంగీర్ డెడ్‌బాడీ లభ్యం: కొర్రెముల వద్ద మృతదేహం గుర్తింపు

 ఐదు రోజుల క్రితం బాలానగర్  ఐడీపీఎల్ నాలాలో మోహన్ రెడ్డి పడిపోయాడు. ఐదు రోజుల క్రితం స్నేహితులతో కలిసి మోహన్ రెడ్డి మద్యం (liquor)తాగాడు. ఆ తర్వాత నాలాకు సమీపంలోని నిలబడి సిగరెట్ తాగుతూ ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు.  ఆలస్యంగా గుర్తించిన స్నేహితులు మోహన్ రెడ్డిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలాలో ప్రవాహం ఎక్కువగా ఉండంతో మోహన్ రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. 

దీంతో మోహన్ రెడ్డి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నుండి ట్యాంక్ బండ్  మురుగు నీరు వచ్చే  నాలాలో మోహన్ రెడ్డి పడిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ మార్గంలో గాలింపు చర్యలు చేపట్టారు.  అయితే ఇవాళ కుత్బుల్లాపూర్ చెరువు వద్ద  మోహన్ రెడ్డి డెడ్ బాడీ లభ్యమైంది.

చాదర్‌ఘాట్ శంకర్ నగర్ కు చెందిన జహంగీర్ అనే వ్యక్తి  ఈ నెల 1వ తేదీన మూసీలో కొట్టుకుపోయాడు. జహంగీర్ డెడ్ బాడీ సోమవారం నాడు ఘట్‌కేసర్ మండలం కొర్రెముల వద్ద జహంగీర్  మృతదేహం లభ్యమైంది.గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా  కురిసిన వర్షాలతో మూసీకి వరద పోటెత్తింది. ప్రమాదవశాత్తు నాలాలో పడి మోహన్ రెడ్డి, జహంగీర్, రజనీకాంత్ లు మరణించారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు