మోహన్ బాబు ఆస్తులెన్ని? ముగ్గురు బిడ్డల్లో ఎవరికెంత?

By Arun Kumar P  |  First Published Dec 11, 2024, 12:03 PM IST

మోహన్ బాబు కుటుంబంలో విబేధాలు భగ్గుమన్నాయి. ఆయన ఇద్దరు కొడుకల మధ్య వివాదం కాస్త కుటుంబసభ్యుల మద్య గొడవకు దారితీసింది. ఆస్తుల కోసమే ఈ గొడవలన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోహన్ ఆస్తుల గురించి తెలుసుకుందాం. 


Mohanbabu Family disputes: విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో ఎన్ని గొడవలున్నా బైటపడకుండా జాగ్రత్త పడతారు... కానీ మోహన్ బాబు కుటుంబం విషయంలో మాత్రం పరిస్థితి చేయిదాటిపోయింది. దీంతో మంచువారింటి గొడవలు మీడియాకెక్కాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణ మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబు బిడ్డలు ఇలా రోడ్డెక్కడం ఆశ్చర్యకరం. చివరకు సొంత కొడుకే మోహన్ బాబుపై చేయి చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.  

గత ఆదివారం నుండి మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతోంది. ముందు మోహన్ బాబు కొడుకు మనోజ్ ను కొట్టాడని ... ఆ తర్వాత మనోజ్ ను మోహన్ బాబు తన మనుషులతో కలిసి కొట్టారనే ప్రచారం బయటకు వచ్చింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో ఒకరినొకరు కొట్టుకున్నారో లేదోగాని గొడవలు మాత్రం జరుగుతున్నాయనే క్లారిటీ మాత్రం వచ్చింది. తాజాగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా రాయాలా, వద్దా అన్నది తన ఇష్టం అంటూ ఓ ఆడియో రికార్డ్ లో పేర్కొన్నారు.  దీన్నిబట్టి మంచు కుటుంబంలో కలహాలకు ఈ ఆస్తుల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. 

Tap to resize

Latest Videos

ఇలా మంచు కుటుంబంతో తుఫాను రేపిన మోహన్ బాబు ఆస్తులెన్ని? వీటిలో ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు కొన్ని ఆస్తులు పంచిచ్చారు... ఎవరికి ఏం ఇచ్చారు? మరి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవకు కారణమైన ఆస్తులేవి? తదితర విషయాలు తెలుసుకుందాం. 

మోహన్ బాబు ఆస్తిపాస్తులు : 

విలక్షణ నటన, గుక్కతిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్, క్రమశిక్షణ మోహన్ బాబును హీరోగా నిలబెట్టాయి. ఆయన 500 కు పైగానే సినిమాల్లో నటించడమే కాదు నిర్మాతగాను ఎన్నో సినిమాలు రూపొందించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా కొనసాగుతున్నారు. కొంతకాలం రాజకీయాల్లో కూడా వున్నారు... ఎంపీగా పనిచేసారు. అయితే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా మనిషిగానే ఆయన వుండటానికి ఇష్టపడ్డారు. 

undefined

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న పెద్దమనుషుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన గతంలో హీరోగా, ఇప్పుడు నిర్మాతగా సంపాదించిన డబ్బులను తెలివిగా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఆయన తిరుపతిలో 1992లోనే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించారు. ఇది ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరింది. అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబిఏ, ఎంసిఏ కాలేజీలు, మెడికల్ రంగానికి చెందిన ఫార్మా, నర్సింగ్ కాలేజీలు ఈ ట్రస్ట్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. 

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి సమీపంలోనే ఎస్విఈటి విద్యాసంస్థలన్ని కొనసాగుతున్నాయి. మోహన్ బాబు కుటుంబానికి వున్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యాసంస్థలే ప్రధానమైనవి. ఈ విద్యాసంస్థలు వందలాది ఎకరాల్లో కొనసాగుతున్నాయి... వేలాదిమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదివినవారు ఇప్పుడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.  

ఇక మోహన్ బాబుకు హైదరాబాద్ లో ఇండ్లు, రంగారెడ్డి జిల్లా జల్ పల్లిలో ఫామ్ హౌస్ వుంది.  అలాగే ఫిల్మ్ నగర్ లో ఓ ఇల్లు, నగరంలో పలు ప్లాట్లు వున్నాయి. సొంతూరిలో ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే వుంచారు మోహన్ బాబు. కొంత వ్యవసాయ భూమి కూడా మోహన్ బాబు కు వుంది. 

ఇక సినీ నిర్మాతగా మారిన తర్వాత మోహన్ బాబు పలు నిర్మాణ సంస్థలను స్థాపించారు.ఇలా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్ మెంట్ నిర్మాణ సంస్థల ద్వారా అనేక సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇలా సినీమా రంగంలో హీరో నుండి ప్రొడ్యూసర్ గా మారారు మోహన్ బాబు. సినిమాల్లోనే కాదు మరికొన్ని సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. 

ఇక మోహన్ బాబు వద్ద చాలా కార్లు వున్నాయి. ఆడి క్యూ7.రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వంటి ఖరీదైన కార్లు వున్నాయి. మోహన్ బాబుతో పాటు కుటుంబసభ్యులు ఉపయోగించడానికి మరికొన్ని సాధారణ కార్లు కూడా వున్నాయి. 

మోహన్ బాబు ఆస్తులు ఎవరికెలా పంచారు : 

మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురూ సినీ రంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా మంచి నటిగా పేరుతెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే మోహన్ బాబు ఆస్తులు పంచినట్లు తెలుస్తోంది. 

కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిల్మ్ నగర్ లోని ఇంటిని ఇచ్చేసినట్లు స్వయంగా మోహన్ బాబు ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ఇక పెద్దకొడుకు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చూసుకుంటున్నారు. తిరుపతిలో ఆస్తులన్నింటిని మోహన్ బాబు పెద్దకొడుకుకే అప్పగించినట్లు తెలుస్తోంది.

చిన్నకొడుకు మంచు మనోజ్ కు హైదరాబాద్ శివారులోని ఓ ప్లాట్ ను ఇచ్చారు మోహన్ బాబు. మనోజ్ భార్యాపిల్లలతో కలిసి అక్కడే వుంటున్నాడు. ఇక మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో మోహన్ బాబు తెలిపారు. జల్ పల్లి లోని ఫామ్ హౌస్ లో ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబంతో సహా నివాసం వుంటున్నారు. 

మంచి ఫ్యామీలిలో గొడవకు కారణం అదేనా? 

తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతోందన్నది మంచు మనోజ్ వాదనగా తెలుస్తోంది. అత్యంత విలువైన శ్రీ విద్యానికేతన్ ను విష్ణుకు ఇచ్చేయడం మనోజ్ కు నచ్చలేదని... ఈ విషయంలోనే పలుమార్లు మంచు ఫ్యామిలీలో గొడవకు దిగినట్లు తెలుస్తోంది.

ఇక మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు కుంటుంబంలో విబేధాలు బయటకు వచ్చాయి. చాలాకాలంగా మనోజ్ భార్యాబిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా వుంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విబేదాలు బయటపడ్డాయి.

అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి. కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి చేరింది. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు. అలాగే విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడినట్లు అయ్యింది. 

click me!