కారెక్కనున్న అజరుద్దీన్: ఎన్నారై చర్చలు, కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

By pratap reddyFirst Published Jan 2, 2019, 7:30 AM IST
Highlights

ఓ ఎన్నారై అజరుద్దీన్ తరఫున టీఆర్ఎస్ నాయకత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అజరుద్దీన్ ను సికింద్రాబాదు లోకసభ స్థానం నుంచి పోటీకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అజరుద్దీన్ ను పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

ఓ ఎన్నారై అజరుద్దీన్ తరఫున టీఆర్ఎస్ నాయకత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అజరుద్దీన్ ను సికింద్రాబాదు లోకసభ స్థానం నుంచి పోటీకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శానససభ ఎన్నికలకు ముందు అజరుద్దీన్ ను కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెసు తరఫున ప్రచారం కూడా చేశారు.  అయితే, మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి అజరుద్దీన్ పోటీకి దించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అజరుద్దీన్ కు రుచించడం లేదని అంటున్నారు.

అజరుద్దీన్ 2009 కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత మొరాదాబాదు లోకసభ స్థానం నుంచి పోటీ చేసి విజదయం సాధించారు. 

click me!