బీఆర్ఎస్‌కు షాక్: రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 26, 2023, 1:55 PM IST

బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి  ఇవాళ రాజీనామా చేశారు.


హైదరాబాద్: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారంనాడు రాజీనామా చేశారు. మీరు తనకు  అన్ని విధాలుగా సహకరించారని  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి  తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కానీ స్థానికంగా ఉన్న సమస్యలను పట్టించుకోలేదన్నారు. పార్టీ నాయకత్వానికి  రాజీనామా లేఖను  ఫాక్స్ ద్వారా పంపుతున్నట్టుగా దామోదర్ రెడ్డి ప్రకటించారు. కొల్లాపూర్ లో ప్రియాంకగాంధీ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా  దామోదర్ రెడ్డి ప్రకటించారు.

గురువారంనాడు కొల్లాపూర్ లో  మీడియాతో  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడారు. నాలుగున్నర ఏళ్ల క్రితం కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరినట్టుగా చెప్పారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత  ఏనాడూ సీఎం అపాయింట్ మెంట్ కోరినా కూడ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. ఇవాళ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. అయితే  ఎమ్మెల్సీ పదవికి కూడ రాజీనామా చేయాలని తాను భావిస్తున్నట్టుగా  దామోదర్ రెడ్డి  చెప్పారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలా వద్దా అనే విషయమై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఆదేశాల ప్రకారం వ్యవహరించనున్నట్టుగా  దామోదర్ రెడ్డి  పేర్కొన్నారు. ఒక్క పార్టీ నుండి వచ్చిన పదవిని  మరో పార్టీలో చేరిన సమయంలో వదులుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Videos

undefined

తాను బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలని  నిర్ణయం తీసుకోన్నందున  ఎమ్మెల్సీ పదవికి కూడ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా ఆయన తెలిపారు.  అయితే  ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వం  సూచనలను కూడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ నెల  1వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన  మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి  బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి కసిరెడ్డి నారాయణ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.  కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో నాగర్ కర్నూల్ నుండి  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి టిక్కెట్టును కేటాయించింది. 

also read:పాలమూరులో టిక్కెట్ల కోసం నేతల మధ్య పోరు: ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్ నేతలు

రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూల్ టిక్కెట్టు దక్కడంతో మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి  తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  కారణంగానే తనకు  నాగర్ కర్నూల్ నుండి టిక్కెట్టు రాలేదని  నాగం జనార్థన్ రెడ్డి  విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 


 


 

click me!