కేసీఆర్ పింఛన్‌లు మంచిగిత్తండు.. పాలన అప్పటికంటే ఇప్పుడు నయ్యం : ఎమ్మెల్సీ కవితతో కంకులమ్మే కొమురవ్వ (Video)

Published : Jul 10, 2023, 06:38 PM IST
కేసీఆర్ పింఛన్‌లు మంచిగిత్తండు.. పాలన అప్పటికంటే ఇప్పుడు నయ్యం : ఎమ్మెల్సీ కవితతో కంకులమ్మే కొమురవ్వ (Video)

సారాంశం

సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి తిరిగి వస్తుండగా మల్యాల మండలం నూకపల్లి శివారులో రోడ్డు పక్కన కంకులమ్ముతున్న కొమురవ్వ దగ్గరకు వెళ్లి మాట కలిపారు. కంకి తింటూ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. కవిత తన వద్దకు వచ్చి మాట్లాడటంతో కొమురవ్వ సంతోషపడ్డది.  

జగిత్యాల: సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిత్యం పనుల్లో బిజీగా ఉంటారు. సమావేశాలు, అభివృద్ధి పనులు ఇలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. కానీ, సోమవారం ఆమె రోడ్డు పక్క కంకులమ్మే కొమురవ్వతో మాట్లాడుతూ.. మక్క కంకులు ఆస్వాదిస్తూ కాస్త సేదతీరారు. కొమురవ్వతో మాట కలిపి పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

జగిత్యాలకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత సోమవారం తిరుగు ప్రయాణం అయ్యారు. ఆమె కారులో వస్తుండగా మల్యాల మండలం నూకపల్లి శివారులో రోడ్డు పక్కన మక్క కంకులు అమ్ముతూ ఓ మహిళ కనిపించింది. వెంటనే కారు అక్కడ ఆపమని ఆదేశించారు. కారు దిగి సాదాసీదాగా కంకులు అమ్ముతున్న కొమురవ్వ దగ్గరకు వెళ్లారు. ఏ కంకి కాల్చి ఇస్తావు అమ్మా అంటూ అడిగారు. 

ఆ పొయ్యి ముందే కూర్చుని మక్క కంకులను చూసింది. తనకు ఫలానా కంకి కావాలని అడిగారు. కంకి పొయ్యి మీద కాలుతూ ఉంటే ఈ కంకులు మన పొలంలో పండినయేనా? కొన్నరా? అని అడిగారు. మనవి కావు.. బస్తాలుగా కొంటామని కొమురవ్వ చెప్పింది. ఇంకా ఆమె వెనుక ఉన్నవారిని చూసి అమ్మా, బిడ్డనా? అని అడగ్గా.. కొమురవ్వ నవ్వుతూ అవును అని సమాధానం ఇచ్చింది. ఆ కంకి తింటూ కవిత రుచి ఆస్వాదించారు.

అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ పాలన గురించీ ఎమ్మెల్సీ కవిత.. కొమురవ్వను అడిగింది. సమైక్య పాలనతో ఇప్పుడు మంచిగున్నదని కొమురవ్వ చెప్పింది. కేసీఆర్ సారు మంచిగా పాలిస్తుండు అని అన్నది. ఇంటింటికి పింఛన్ ఇస్తుండని చెప్పింది. ఇంకా రకరకాలుగా, వేరేవేరే పథకాల కింద పైసలు ఇస్తుండని వివరించింది. ఆ పైసలు ఎంతో పనికొస్తున్నాయని తెలిపింది.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

స్వయంగా కేసీఆర్ సారు బిడ్డే తన వద్దకు వచ్చిందని కొమురవ్వ సంబురపడ్డది. తన దగ్గరే కూసొని మక్క కంకి తింటూ మాట్లాడటంతో ఆమె తబ్బుబ్బిపోయింది. 

రోడ్డుపక్కన సాదాసీదాగా ఎమ్మెల్సీ కవితను చూసి ఆ రోడ్డుపై ప్రయాణికులు షాక్ అయ్యారు. వాహనాలు ఆపేసి వచ్చి ఆమెతో సెల్ఫీలు దిగారు. వారందరితోనూ కవిత ఆప్యాయంగా మాట్లాడారు. సీఎం కూతురైనా.. చాలా సాధారణంగా నడుచుకుంటున్నారని అక్కడి వారంతా చర్చించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు