ఈ ఎన్నికల్లో రాహుల్ పోరాటం రైతులకు వ్యతిరేకంగానా ? .. ఎమ్మెల్యే కవిత ఆగ్రహం

By Rajesh Karampoori  |  First Published Oct 27, 2023, 4:06 AM IST

MLC Kavitha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి.  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది.   


MLC Kavitha: తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో రైతులతో కలిసి పోరాడకుండా వారిపై పోరాడుతున్నారని, రైతు బంధు వాయిదాల చెల్లింపును నిలిపివేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు కోరడమేంటని ఎమెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమ పథకాలైన రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరిని దుయ్యబట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల నుండి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందకుండా నిలిపివేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందనీ, మరీ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకమేననీ,  విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేస్తారా ? అని ఆమె ప్రశ్నించారు. మిషన్ భగీరథ కింద నీటి సరఫరాను కూడా కాంగ్రెస్ ఆపేస్తుందన్న భయం నెలకొందని అన్నారు.  

Latest Videos

అలాగే..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని, ఏళ్ల తరబడి అమలులో ఉన్న పథకాలను కూడా నిలిపివేయాలని కోరడం అత్యంత శోచనీయమని ఆమె అన్నారు. రాష్ట్ర పథకాల అమలును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయలేదనీ, వారి పాలనలో వెనుకబడిన తరగతులు చాలా కాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు.  

కాంగ్రెస్‌ పాలనలో రైతులను నిరాదరణకు గురయ్యారని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పరిహారం చెల్లించకుండా రైతుల భూములు సేకరించిన సందర్భాలున్నాయనీ, కేవలం కేసీఆర్ మాత్రమే రైతులకు అండగా నిలిచారని, పేదలకు అన్ని విధాలా సహకరించారని వివరించారు. తనకు రైతులే ముఖ్యమని, రైతు ఇబ్బందులకు గురిచేసి సాధించేది ఏం లేదని అన్నారు.    

మైనారిటీల సంక్షేమానికి కనీసం కృషి చేసినా కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. కానీ, మైనారిటీల అభివృద్ధికి బీఆర్‌ఎస్ నాయకత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. నియోజకవర్గం నుంచి పారిపోయిన కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ మరోసారి ఓట్ల కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారనీ, కానీ అంతిమ సీఎం కేసీఆర్ దేనని అన్నారు. 

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ, నేత ధర్మపురి అరవింద్ ఓటమి ఖాయమని . కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసే సాహసం ఎవరు చేసినా .. ఫలితం శూన్యమని  వారు పరాజయం పాలవుతారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
 

click me!