కేసీఆర్ చదివిన ఆ పుస్తకాలే... తెలంగాణ విముక్తిలో ప్రధాన పాత్ర: ఎమ్మెల్సీ కవిత

By Arun Kumar PFirst Published Jun 15, 2021, 4:24 PM IST
Highlights

జగిత్యాల జిల్లా గ్రంథాయాల కమిటీ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ తో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

జగిత్యాల: ఉద్యమ నాయకులు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పుస్తకాలు చదివారని... స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయనకు ఇవి ఎంతగానే ఉపయోగపడ్డాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ విముక్తిలో ఈ పుస్తకాలే ప్రధాన పాత్ర పోషించాయన్నారు. 

జగిత్యాల జిల్లా గ్రంథాయాల కమిటీ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ తో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీలను పటిష్ట పరిచి పేద విద్యార్థులు పోటీ పరీక్షల కోసం చదువుకునే విధంగా పుస్తకాలను అందుబాటులో వుంచుతున్నామన్నారు. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాలో కోటి 50లక్షలతో మోడల్ లైబ్రరీ నిర్మించినట్లు కవిత వెల్లడించారు.

read more  రైతు బాంధవుడు కేసీఆర్.. అంటూ చిత్రపటానికి పాలాభిషేకం.. (వీడియో)

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కూడా పాల్గొన్నారు. అలాగే జగిత్యాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

click me!