సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

By narsimha lodeFirst Published Jan 15, 2022, 4:04 PM IST
Highlights

సంక్రాంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో గొబ్బెమ్మలు పెట్టి ప్రత్యేకంగా ముగ్గు వేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.


హైదరాబాద్: సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ Kavitha. Hyderabad లోని తన నివాసంలో Mlc  కవిత  వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులతో అలంకరించారు.

ఈ ముగ్గులతో వాకిలి ప్రత్యేక శోభను సంతరించుకుంది. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు,సిరి సంపదలు, సుఖ  సంతోషాలతో ఉండాలని  ఎమ్మెల్సీ కవిత కోరుకొన్నారు.ప్రజలందరికీ Sankranti శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ కూతురు కవిత ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి Bjp అభ్యర్ధి Dharmapuri arvind చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. 2014లో ఆమె Nizambadపార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి పాలైన చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ చీఫ్ Kcr కవితను ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే కొంత కాలం క్రితం కవితను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే అనుహ్యంగా ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.

కవితకు ఎమ్మెల్సీని కట్టబెట్టడం రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆమెను తీసకొంటారా అనే చర్చ కూడా అప్పట్లో సాగింది. అయితే రాష్ట్ర కేబినెట్ లో ఇద్దరు మహిళలకు కేసీఆర్ చోటు కల్పించారు. కవితకు కేబినెట్ లో చోటు కల్పిస్తే వెలమ సామాజిక వర్గం సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆమెకు కేబినెట్ లో ఇప్పట్లో చోటు దక్కకపోవచ్చనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. 

తెలంగాణ జాగృతి ద్వారా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ బతుకమ్మ సంబరాలను కవిత నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను తెలంగాణ జాగృతి ద్వారా కవిత ప్రచారం చేశారు. 

మరో వైపు  రాజ్ భవన్ లో  సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ కుటుంబ సభ్యులతో పాటు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్ భవన్ లో పాలు పొంగించారు గవర్నర్ తమిళిసై.

తెలంగాణ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు చెప్పారు. కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ సంక్రాంతిని జరుపుకోవాలని గవర్నర్ ప్రజలను కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఆమె ప్రజలను కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను ఆమె అభినందించారు. 

కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ పౌష్టికాహరం తీసుకోవాలని గవర్నర్ కోరారు.అర్హులైన వారంతా కరోనా బూస్టర్ డోసు తీసుకోవాలని గవర్నర్ కోరారు. కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని గవర్నర్ కోరారు. 
 

click me!