రేపు తెలంగాణ, ఏపీల్లో వర్షాలు- భారత వాతావరణ శాఖ

By team teluguFirst Published Jan 15, 2022, 4:01 PM IST
Highlights

తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రేపు అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. శ‌నివారం సాయంత్రం ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. 

తెలంగాణ (telangana), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (andrapradhesh) లో రేపు అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. శ‌నివారం సాయంత్రం ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుఫాను ప్రభావంతో రాబోయే 4-5 రోజుల్లో తమిళనాడు (thamilnadu), పుదుచ్చేరి (pudhicheri), కారైకాల్ (karaikal), కేరళ (kerala), మాహేలలో (mahela) తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంద‌ని చెప్పింది. 

రేప‌టి వ‌ర‌కు 16 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌తో పాటు మరఠ్వాడా (martwada), విదర్భ (vidarbha), ఛత్తీస్‌గఢ్ (chathesghad)లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 4-5 రోజులలో ఉత్తర భారతదేశంలో దట్టమైన నుంచి, అతి దట్టమైన పొగమంచు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. వాయువ్య భారతదేశంలో రాబోయే రెండు రోజుల పాటు చలి వాతావరణ పరిస్థితులు ఉంటాయ‌ని అంచ‌నా వేసింది. పశ్చిమ బెంగాల్ (west bengal), సిక్కిం (sikhim), జార్ఖండ్‌లలో (jarkhand) తేలికపాటి లేదా మోస్తరు వర్షపాతం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ (arunachal pradhesh), అస్సాం (assam), మేఘాలయలలో (meghalaya) పాటు నాగాలాండ్ (nagaland), మణిపూర్ (manipur), మిజోరాం (mizoram)త్రిపురల (tripura) వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. 

రాబోయే రెండు రోజుల పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ (uthara pradhesh), పశ్చిమ మధ్యప్రదేశ్‌ (madya pradhesh) లోని ప‌లు ప్రాంతాల్లో చలిగాలుల వీస్తాయ‌ని చెప్పింది. పంజాబ్‌లో (punjab), హర్యానా (haryana), చండీగఢ్ (chandighad), పశ్చిమ ఉత్తరప్రదేశ్ (uthara pradhesh), రాజస్థాన్‌లోని (rajastan)వివిధ ప్రాంతాల‌తో పాటు అతి శీత‌ల గాలులు వీస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అలాగే మూడు రోజుల పాటు పశ్చిమ హిమాలయ ప్రాంతం, రాజస్థాన్, అస్సాం (assam), మేఘాలయ (meghalaya), నాగాలాండ్ (nagaland), మణిపూర్ (manipur), మిజోరాం (mizoram). త్రిపురలలో (tripura) రాత్రి, ఉద‌యం స‌మ‌యాల్లో ద‌ట్ట‌మైన పొగ‌మంచు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. 

click me!