ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంది. ఆమెకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం ( నేడు ) రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మరికొద్ది సేపట్లో కవిత బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంది. ఆమెకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం ( నేడు ) రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మరికొద్ది సేపట్లో కవిత బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది.వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 26వ తేదీన బెయిల్ పిటిషన్ కవిత దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు, ఈ కేసులో బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలో తన చిన్న కుమారుడు పరీక్షల కారణంగా ఏప్రిల్ 16వరకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1వ తేదీనే బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభమైనప్పటికీ అది పూర్తిగా జరగలేదు.
ఆ పిటిషన్ వివరణను ఈ రోజుకి వాయిదా వేసింది.ఈ తరుణంలో కవితకు ఏ బెయిల్ కావాలో.. మధ్యంతర బెయిల్ లేదా రెగ్యులర్ బెయిల్ అనేది నిర్ణయించుకోవాలని కవిత తరఫు వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరుతూ కోర్టు విచారణను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. ఈ తరుణంలో నేడు మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కోర్టులో బెయిల్ పిటీషన్ పై కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు
undefined
కవితకు వ్యతిరేకంగా అరుణ్ రామచంద్ర పిల్లే, బుచ్చిబాబులను బెదిరించి తన క్లయింట్ పేరు చెప్పించారనీ, అంతేకాదు అరుణ్ రామచంద్ర పిల్ల తొమ్మిది సార్లు తన వాంగులలో ఎక్కడ కూడా కవిత పేరు చెప్పలేదనీ, ఆ తర్వాత తన క్లయింట్ కవిత పేరు చెప్పారని చెప్పించారని న్యాయవాది అభిషేక్ సింఘ్వీని అంటున్నారు. అదే సమయంలో అరుణ్ పిళ్లే తన వాంగ్ములాన్ని వెనక్కి తీసుకున్నారని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కవితకు లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవనీ, కచ్చితంగా కవితకు బెయిల్ ఇవ్వాలన్నారు.
అంతే కాదు ప్రస్తుతం కవిత చిన్న కొడుకు పరీక్షలు రాస్తున్నారనీ, తల్లిగా కవిత పక్కన ఉండాలని అందుకోసమే కవితకు మధ్యంతర బయలు కూడా ఇవ్వాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరారు. మధ్యంతరపై ఈ రెండింటికి సంబంధించి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా వాటినే కొనసాగించబోతున్నారు
మరోవైపు.. కవితకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయి ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి ఆమె 100 కోట్ల రూపాయల లావాదేవిలను జరిపినట్లు వాటికి సంబంధించినటువంటి మనీ ల్యాండరింగ్ సంబంధించిన అన్ని ఆధారాలున్నాయనీ, అన్ని ఆధారాలతోనే కవితలు అరెస్టు చేయాల్సి వచ్చింది ఈడీ చెబుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఏ విధమైనా ఇస్తారనేది ఎదురు చూడాలి.