ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

Published : Jun 07, 2023, 02:31 PM ISTUpdated : Jun 07, 2023, 03:22 PM IST
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

సారాంశం

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో సాగునీటి దినోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వల్పకాలంలోనే రాష్ట్ర గతిని మార్చేలా కాళేశ్వరం  ప్రాజెక్టును  నిర్మించారని అన్నారు. ఆయనను  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం కూడా కాళేశ్వరం గురించి గర్వంగా చెప్పుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి వ్యక్తి పనిచేశారని.. అప్పుడు ఎన్ని నిధులు  వచ్చాయి.. ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయనేది ప్రజలు ఆలోచించాలని  కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా కేసీఆర్ భేటీ అయ్యి వారిని ఒప్పించారని అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తే నిజమైన రాజకీయ నాయకుడని పేర్కొన్నారు.

కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని.. ఇలాంటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవటం సిగ్గు చేటని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంతో ఎక్కువ లబ్దిపొందుతున్నది నిజామాబాద్ జిల్లాయేనని తెలిపారు. జిల్లాలో లక్ష 80 వేల ఎకరాలకు సాగునీరు అందించుకుంటున్నామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే