మల్లారెడ్డి కాలేజ్‌లో హోలీ సంబరాలు.. విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్సీ కవిత డ్యాన్స్ (వీడియో)..

Published : Mar 07, 2023, 02:13 PM ISTUpdated : Mar 09, 2023, 09:58 AM IST
మల్లారెడ్డి కాలేజ్‌లో హోలీ సంబరాలు.. విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్సీ కవిత డ్యాన్స్ (వీడియో)..

సారాంశం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోలీ వేడుకల్లో భాగంగా విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోలీ వేడుకల్లో భాగంగా విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా శక్తి గురించి మాట్లాడారు. అనంతరంమల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి ఎమ్మెల్సీ  కవిత హోలీ సెలబ్రేషన్స్‌‌‌లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కవిత విద్యార్థినులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులపైకి రంగులు చల్లారు. విద్యార్థినులు కూడా  కవిత వద్దకు చేరుకుని ఆమెకు రంగులు పూసారు. అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డి  కోడలు, కాలేజ్ విద్యార్థినులతో కలిసి కవిత సరదాగా డ్యాన్స్ చేశారు. దీంతో కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఆనందంలో మునిగిపోయారు.

 


ఇక, మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్‌లో హోలీ సెలబ్రేషన్స్‌లో విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్ కుటుంబంతో హోలీ, మహిళా సాధికారత వేడుకల్లో పాల్గొన్నట్టుగా పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి