విభజన, సమైక్యవాదుల మీటింగ్ ముచ్చటేస్తోంది: కేసీఆర్‌పై జీవన్ రెడ్డి సెటైర్లు

Published : Jun 30, 2019, 01:03 PM IST
విభజన, సమైక్యవాదుల మీటింగ్ ముచ్చటేస్తోంది: కేసీఆర్‌పై జీవన్ రెడ్డి సెటైర్లు

సారాంశం

కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా... ఉమ్మడి ఏపీ  రాష్ట్రానికి ముఖ్యమంత్రా  అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు. సమైక్యవాది, విభజనవాదుల సమావేశాన్ని చూస్తే ముచ్చటేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 


హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా... ఉమ్మడి ఏపీ  రాష్ట్రానికి ముఖ్యమంత్రా  అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు. సమైక్యవాది, విభజనవాదుల సమావేశాన్ని చూస్తే ముచ్చటేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ఆదివారం నాడు స్పందించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో  రాయలసీమకు నీళ్లిస్తామంటే ఆంధ్రోళ్లకు నీళ్ల  దోపీడీ చేస్తున్నారని కేసీఆర్  విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడు నీళ్ల తరలింపుకు ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రాణహిత పుట్టిన ఆదిలాబాద్ జిల్లాకు  ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఏమయ్యాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని  ఆయన ప్రశ్నించారు. సమైక్యవాదులతో చర్చలు అంటే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని జీవన్ రెడ్డి చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?