అందుకే కడియంను ఆహ్వానించలేదు: బీఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంపై తాటికొండ రాజయ్య

By narsimha lode  |  First Published Apr 2, 2023, 5:20 PM IST

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి  చేసిన ఆరోపణలపై  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  స్పందించారు.  ఈ నెల  4న నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి  కడియం శ్రీహరిని ఆహ్వానించనున్నట్టుగా  ఆయన  చెప్పారు. 


వరంగల్:  నల్గొండకు  ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి ఇంచార్జీగా  ఉన్నందున  ఆత్మీయ సమ్మేళనాలకు  ఆహ్వానించలేదని  మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య  చెప్పారు. 

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల గురించి తనకు  సమాచారం లేదని  ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి   చెప్పారు. మీడియా సమావేశం ఏర్పాటు  చేసి  ఈ వ్యాఖ్యలు  చేశారు.ఈ వ్యాఖ్యలపై  ఆదివారంనాడు  రాజయ్య స్పందించారు.    బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు  నల్గొండకు   కడియం శ్రీహరి  ఇంచార్జీగా ఉన్నందునే  ఆత్మీయ సమ్మేళనాలకు  ఆహ్వనం పంపలేదన్నారు.  పార్టీ అధిష్టానం  సూచలను  తాను పాటిస్తానని  రాజయ్య  చెప్పారు.  ఈ నెల  4వ తేదీన  స్టేషన్ ఘన్ పూర్ క్లస్టర్  1  ఆత్మీయ సమ్మేళనం  నిర్వహించనున్నట్టుగా  రాజయ్య చెప్పారు.ఈ సమావేశానికి  కడియం శ్రీహరి  సమయం తీసుకుంటామని  రాజయ్య తెలిపారు. 

Latest Videos

  స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి  కడియం శ్రీహరి  గతంలో  ప్రాతినిథ్యం వహించారు. 2014 ఎన్నికలకు  ముందు  కడియం శ్రీహరి  టీడీపీని వీడి  బీఆర్ఎస్ లో  చేరారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీలో  ఉన్న రాజయ్య  బీఆర్ఎస్ లో  చేరారు.  స్టేషన్ ఘన్ పూర్ నుండి  పోటీ విషయమై  కడియంశ్రీహరి, రాజయ్యలు పోటీ పడ్డారు. అయితే  కేసీఆర్ రాజయ్యకే అవకాశం ఇచ్చారు.  ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు  చోటు  చేసుకున్నాయి. వరంగల్ నుండి కడియం శ్రీహరి ఎంపీగా విజయం సాధించారు. 2014లో  కేసీఆర్ మంత్రివర్గంలో  రాజయ్యకు  డిప్యూటీ సీఎంగా  అవకాశం దక్కింది. డిప్యూటీ సీఎంగా ఉన్న   రాజయ్యను  కొంత కాలానికి  కేసీఆర్ భర్తరఫ్  చేశారు.   రాజయ్య స్థానంలో  కడియం శ్రీహారిని  కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు.  2019  లో  స్టేషన్ ఘన్ పూర్ నుండి  కడియం శ్రీహరి పోటీకి  ప్రయత్నించారు. కానీ  పార్టీ నాయకత్వం  రాజయ్యకే  అవకాశం ఇచ్చింది. 

also read:ఆత్మీయ సమ్మేళనాల సమాచారం ఇవ్వడం లేదు.. సీఎం ఆదేశాలను పాటించడం లేదు: కడియం కీలక వ్యాఖ్యలు

 కడియం శ్రీహరికి  ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది పార్టీ నాయకత్వం.  స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో  రాజయ్య,  కడియం శ్రీహరి  మధ్య  ఉప్పు నిప్పు మాదిరిగానే పరిస్థితి ఉంటుంది. దీంతోనే  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు  కడియం శ్రీహరికి  సమాచారం ఇవ్వలేదని  ఆయన వర్గీయులు  ఆరోపిస్తున్నారు. కానీ  ఈ ఆరోపణలను  రాజయ్య  తోసిపుచ్చారు. 

click me!