బీఆర్ఎస్ నిర్వహించిన ‘ఛలో నల్లగొండ’ సభ .. ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభ నుంచి తిరిగి వస్తుండగా.. ఓ ఎమ్మెల్యే కారు అదుపుతప్పి అక్కడే ఉన్న హోంగార్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో హోంగార్డుకు గాయాలు కావడంలో తోటి సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ వేదికగా బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘ఛలో నల్లగొండ’ సభ.. ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభ నుంచి తిరిగి వస్తుండగా.. ఓ ఎమ్మెల్యే కారు అదుపుతప్పి అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో హోంగార్డుకు గాయాలు కావడంలో తోటి సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకెళ్లే.. బీఆర్ఎస్ ‘ఛలో నల్లగొండ’ సభకు పెద్ద ఎత్తున వాహనాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున హోంగార్డులను గస్తీగా పెట్టారు. ఈ క్రమంలోనే చర్లపల్లి వద్ద ఎమ్మెల్యే కారు అదుపుతప్పింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కిషోర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆ హోంగార్డు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తోటి సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదిలాఉండగా.. కేసీఆర్ సభ అనంతరం.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత హైదరాబాద్ కు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మర్గమధ్యలో నార్కట్‌పల్లి సమీపంలో చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొంది. దీంతో ఆమె కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. ఈ ఘటన జరిగిన అనంతరం.. ‘ నేను సురక్షితంగా ఉన్నాను.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.