నా అభిప్రాయాలతో ఏకీభవించినట్టే కదా..: ట్విస్టిచ్చిన కోమటిరెడ్డి

By narsimha lodeFirst Published Jun 27, 2019, 1:18 PM IST
Highlights

పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  వివరణ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ సంఘానికి కోమటిరెడ్డి ప్రశ్నలు కురిపించారు. 

హైదరాబాద్: పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  వివరణ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ సంఘానికి కోమటిరెడ్డి ప్రశ్నలు కురిపించారు. గతంలో తాను పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసినా కూడ టిక్కెట్టు ఇచ్చారంటే  తాను  చేసిన విమర్శలను సమర్ధించినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

 పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఈ నోటీసులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.

తాను పార్టీకి వ్యతిరేకించలేదని రాజగోపాల్ రెడ్డి  ఆ నోటీసులో పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యంతోనే సలహాలు ఇచ్చినట్టుగా  ఆయన చెప్పారు. గతంలో కూడ తనకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గతంలో తనకు నోటీసులు జారీ చేసిన సమయంలో కూడ ఈ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను సమాధానం ఇవ్వకపోతే  తన అభిప్రాయాలతో ఏకీభవించినట్టేనా అని ఆయన ప్రశ్నించారు.

పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసినా ... షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకున్నా  తనకు టిక్కెట్టు ఇచ్చారని  ఆయన గుర్తు చేశారు.  నాడు పార్టీ కోసం తాను చేసిన విమర్శలు సరైనవేనని నాయకత్వం అంగీకరించినట్టేనా అని  ప్రశ్నించారు.

నాడు తప్పు అనిపించని మాటలు.... ఇవాళ ఎలా  తప్పు అనిపించిందో చెప్పాలన్నారు.  పార్టీ శ్రేయస్సు కోసమే తాను ఈ వ్యాఖ్యలు చేశానని రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.  

click me!