కేసీ వేణుగోపాల్‌తో జగ్గారెడ్డి భేటీ: రాజీనామా వెనక్కి

Published : Apr 05, 2022, 04:22 PM ISTUpdated : Apr 05, 2022, 04:23 PM IST
 కేసీ వేణుగోపాల్‌తో జగ్గారెడ్డి భేటీ: రాజీనామా వెనక్కి

సారాంశం

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపల్ తో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తన రాజీనామాను కూడా వెనక్కి తీసుకొంటున్నట్టుగా కేసీ వేణుగోపాల్ కు జగ్గారెడ్డి వివరించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి KC Vengopal ల్ తో సంగారెడ్డి ఎమ్మెల్యే Jagga Reddy మంగళవారం నాడు భేటీ అయ్యారు.సోమవారం నాడు Rhul Gandhi తో తెలంగాణకు చెందిన 38 మంది ముఖ్యమైన Congress  నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్టీ నేతల మధ్య ఉన్న బేదాభిప్రాయాలపై కూడా చర్చించారు. అయితే నేతలంతా ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై పార్టీ ఎన్నికల వ్యూహాకర్త Sunil  ఇచ్చిన నివేదిక ఆధారంగా వ్యూహాంపై రాహుల్ గాంధీ పార్టీ నేతలతో చర్చించారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. రాహుల్ తో భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన Resignation ను వెనక్కి తీసుకొంటున్నట్టుగా జగ్గారెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు తాను ఏం మాట్లాడాననే విషయమై కూడా అంతా మర్చిపోయినట్టుగా జగ్గారెడ్డి వివరించారు. 

ఇదే విషయాన్ని సోమవారం నాడు రాత్రే కేసీ వేణుగోపాల్ కు చెప్పారు. ఇవాళ ఉదయం జగ్గారెడ్డి వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలను వివరించారు. 

సీనియర్ నేతలతో Revanth Reddy వ్యవహరిస్తున్న తీరును కూడా పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాలను కూడా కొందరు నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటివరకు పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టాలని రాహుల్ ఆదేశించారు. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. రాహుల్ ప్రతిపాదనకు పార్టీ నేతలు కూడా అంగీకరించారు.

రేవంత్ రెడ్డి తీరుపై నిరసనగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే పార్టీ సీనియర్ల సూచన మేరకు రాజీనామాపై కొన్ని రోజులు వేచి చూసే ధోరణిని అవలంభించారు. నిన్న రాహుల్ తో భేటీ తర్వాత రాజీనామా లేఖను వెనక్కి తీసుకొంటున్నట్టుగా ప్రకటించారు. రాహుల్ సమక్షంలోనే జగ్గారెడ్డి ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ కు వివరించారు. ఈ విషయమై ఇవాళ వేణుగోపాల్ తో స్వయంగా భేటీ అయి ఈ విషయమై వివరణ ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?