వివాదంలో ప్రభుత్వ విప్.. రైస్ మిల్లు సిబ్బంది చెంప చెల్లుమనిపించిన గంప గోవర్దన్..

Published : May 06, 2023, 03:56 PM ISTUpdated : May 06, 2023, 03:59 PM IST
వివాదంలో ప్రభుత్వ విప్.. రైస్ మిల్లు సిబ్బంది చెంప చెల్లుమనిపించిన గంప గోవర్దన్..

సారాంశం

తెలంగాణ ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ వివాదంలో చిక్కుకున్నారు. రైస్ మిల్లు సిబ్బందిపై ఆయన చేయిచేసుకున్నారు. 

కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ వివాదంలో చిక్కుకున్నారు. రైస్ మిల్లు సిబ్బందిపై ఆయన చేయిచేసుకున్నారు. చెంప చెల్లుమనిపించారు. ఈ క్రమమంలోనే ఆయన క్షమాపణ  చెప్పాలని రైస్ మిల్లు సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన భిక్నూరు మండలం పెద్దమల్లారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాలు.. రైసుమిల్లరు తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ రైతులు గంప గోవర్దన్‌‌కు ఫోన్ చేసి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రైతులతో కలిసి గంప గోవర్దన్ రైస్ మిల్లుకు వెళ్లారు. అక్కడ గంప గోవర్దన్ అడిగిన ప్రశ్నలకు రైస్ మిల్లు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే గంప గోవర్దన్ రైస్ మిల్లు సిబ్బంది చెంప చెల్లుమనిపించారు. ఈ పరిణామంపై రైస్ మిల్లు నిరసనకు దిగారు. గంప గోవర్దన్ క్షమాపణ చెప్పాలని మిల్లులో లోడింగ్ నిలిపివేశారు. దీంతో ధాన్యం  కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మిల్లర్లతో అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి