ఎక్సైజ్ అధికారుల వేధింపులు: వరంగల్ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

By narsimha lodeFirst Published Nov 4, 2020, 10:36 AM IST
Highlights

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఓ వ్యక్తి పురుగుల మందు  తాగి బుధవారంనాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఓ వ్యక్తి పురుగుల మందు  తాగి బుధవారంనాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఎక్సైజ్ అధికారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తన చావుకు ఎక్సైజ్ అధికారుల వేధింపులే కారణమని బాధితుడు సూసైడ్ నోట్ కూడ రాశాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నర్సంపేట మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన ఊడుగుల రాజయ్యను గత ఆరు మాసాలుగా ఎక్సైజ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు  మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఆరు నెలలుగా ఎక్సైజ్ అధికారులు వీరిని ఎందుకు వేధిస్తున్నారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు  ఈ విషయమై విచారణ జరుపుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. రాజయ్యను వేధింపులకు గురి చేసిన ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

 

click me!