
హైదరాబాద్ రామంతపూర్‌లో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతమైంది. బాలిక అనూష మృతదేహాన్ని పోలీసులు స్థానిక చిన్న చెరువులో గుర్తించారు. తల్లి మరణించడంతో అనూష తీవ్రమనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె చిన్నచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ అనూష పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.