జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ జిల్లాలో మంగళవారం నాడు ధానాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు తృటిలో ప్రమాదం తప్పింది.
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ జిల్లాలో మంగళవారం నాడు ధానాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు తృటిలో ప్రమాదం తప్పింది.బోగీల నుండి ఇంజన్ విడిపోయి ముందుకు వెళ్లింది. దీంతో స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేగేటు వద్ద రైలు బోగీలు ఆగిపోయాయి. బోగీలు పట్టాలపైనే నిలిచిపోవడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.
ఈ విషయాన్ని కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ గుర్తించారు. ఆగిన ఇంజన్ ను రప్పించి తిరిగి తగిలించారు. అరగంటపాటు స్టేషన్ ఘన్ పూర్ లో బోగీలు నిలిచిపోయాయి.ఇంజన్ ను బోగీలను తగిలించిన తర్వాత రైలు స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి తరలించారు.సకాలంలో బోగీలు లేకుండా ఇంజన్ ముందుకు వెళ్తున్న విషయం గుర్తించడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకొన్నారు.
రైలు రైల్వే స్టేషన్ నుండి బయటకు వెళ్లే వరకు అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. గతంలో కూడ ఇదే తరహాలో రైలు ప్రయాణాలు చోటు చేసుకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు అరుదుగా ఉన్నాయి.