హైద్రాబాద్‌లో దారుణం: 11 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్

Published : Dec 18, 2019, 07:54 AM IST
హైద్రాబాద్‌లో దారుణం: 11 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్

సారాంశం

హైద్రాబాద్ లో దారుణం చోటు చేసుకొంది. 11 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.


హైదరాబాద్: హైద్రాబాద్ పాతబస్తీలో 11 ఏళ్ళ మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

హైద్రాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి ఆలీనగర్‌లో రంగుల పరిశ్రమలో పనిచేస్తుంటారు. ఈ నెల 13వ తేదీన తాను పనిచేసే రంగుల పరిశ్రమలో పనిచేసే తండ్రి తన కూతురును కూడ పరిశ్రమకు తీసుకెళ్లాడు.

రంగుల ఫ్యాక్టరీలో తండ్రి పనిచేస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిని ముగ్గురు వ్యక్తులు సమీపంలోని గదిలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

దీంతో ఆ బాలిక తీవ్రంగా భయానికి గురైంది. మూడు రోజుల పాటు ఆ బాలిక నోరు విప్పలేదు. చివరకు తండ్రికి ఈ నెల 17వ తేదీన అసలు విషయం చెప్పింది. 

ఈ విషయం తెలిసిన బాధితురాలి తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని తేల్చడంతో  జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలిస్ స్టేషన్ కు పంపారు.నిందితుల కోసం పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!