ట్విస్ట్: ఢిల్లీకి చేరనున్న దిశ నిందితుల మృతదేహాలు

By telugu team  |  First Published Dec 17, 2019, 4:34 PM IST

వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలను ఢిల్లీకి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రీపోస్టుమార్టం కోసం మృతదేహాలను భద్రపరచాల్సిన అవసరం రీత్యా ఆ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.


హైదరాబాద్: గత నెలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతానికి కారణమైనటువంటి నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయారు. అయితే అదే రోజు రాత్రి ఆ నలుగురి మృతదేహాలను ఖననం చేయాలని భావించినప్పటికీ కూడా కొన్ని కారణాలవలన అది వీలుపడలేదు. 

కాగా హై కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి భద్రపరిచారు. అయితే ఆ తరువాత వాటిని హైదరాబాద్ లోని గాంధీ మార్చురీకి తరలించారు. నిజానికి ఆ మృతదేహాలను ఈనెల 13 వరకే భద్రపరచాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ కేసు విషయమై సుప్రీం కోర్టు విచారణ జరుగుతుంది. 

Latest Videos

undefined

Also Read: దిశ కేసు: ఈ నెల 27న ఛార్జీషీటు దాఖలు చేయనున్న పోలీసులు

అయితే వాటిని భద్రపరచడానికి మరికొంత సమయం కావాలని ఆదేశాలు వచ్చాయి. అయితే గాంధీ ఆసుపత్రిలో ఆ మృతదేహాలను ఎంత ఫ్రీజింగ్ లో భద్రపరచినప్పటికీ కూడా ఎంతో కొంత సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.చివరికి అవి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక వాటిని భద్రపరచడం తమ వల్ల కాదని గాంధీ సిబ్బంది చెబుతున్నారు. 

అయితే ఒకవేళ అవి కుళ్ళిపోతే వాటికి రీపోస్టుమార్టం జరపడానికి అవకాశం ఉండదని చెబుతున్నారు వైద్యులు. దీంతో వాటిని ఢిల్లీకి తరలించడానికి అనుమతిని ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సిబ్బంది తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. 

Also Read: కుళ్లిన స్థితిలోకి దిశ నిందితుల మృతదేహాలు: ఎంబామింగ్‌పై వైద్యుల తర్జనభర్జన

ఎందుకంటే ఢిల్లీ ఎయిమ్స్ లో ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది. అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ కూడా వాటికీ ఎలాంటి నష్టం జరగదని గాంధీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.

సమత హత్య కేసులో పోలీసులు ముగ్గురిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దిశ కేసు నేపథ్యంలో తీవ్ర ఆందోళన చెలరేగడంతో సమత కేసు విచారణకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది.

click me!