హైదరాబాద్ మల్లంపేటలో దారుణం.. మైనర్ బాలికపై మారు తండ్రి అత్యాచారం..

Published : Mar 14, 2022, 10:26 AM IST
హైదరాబాద్ మల్లంపేటలో దారుణం.. మైనర్ బాలికపై మారు తండ్రి అత్యాచారం..

సారాంశం

హైదరాబాద్‌లోని మల్లంపేటలో దారుణం చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. కుమార్తెను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం వెలుగుచూసింది. 

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మల్లంపేట్‌లో ఓ బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో.. తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. మల్లంపేటలో ఓ జంట 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మహిళతో సహజీనం చేస్తున్న అతడు ఆమె మైనర్ కూతురిపై కన్నేశాడు. బాలికను లోబర్చుకుని పదే పదే బాలికపై అత్యాచారం చేశారు. 

మారు తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంంతో బాలిక గర్భం దాల్చింది. అయితే ఇటీవల బాలిక అనారోగ్యంతో ఉండగా.. తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించగా.. బాలిక గర్భవతి అని తేలింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మారు తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక తెలిపింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. 

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?