నోరు మూసి ఇంట్లోకి ఎత్తుకెళ్లి బాలికపై యువకుడి అత్యాచారం

Published : Jun 25, 2020, 08:04 AM ISTUpdated : Jun 25, 2020, 08:05 AM IST
నోరు మూసి ఇంట్లోకి ఎత్తుకెళ్లి బాలికపై యువకుడి అత్యాచారం

సారాంశం

తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మెదక్: తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మాడ్చెట్ పల్లిలో బుధవారం జరిగిన ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

మాడ్చెట్ పల్లి గ్రామానికి చెందిన తాలరి మోహన్(19) కూలీ పనులు చేస్తుంటాడు. ఈ నెల 21వ తేదీన తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఎనిమిదేళ్ల వయస్సు గల బాలికను నోరు మూసి బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆ తర్వాత బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింది. తల్లిదండ్రులు ప్రశ్నించిగా అసలు విషయం చెప్పింది. దాంతో బాలిక తండ్రి బుధవారం పెద్దశంకరంపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils NTR Statue
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR