తెలంగాణలో పది వేలు దాటిన కరోనా: కొత్తగా 891 కేసులు, ఐదుగురి మృతి

By Siva KodatiFirst Published Jun 24, 2020, 9:14 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 891 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరుకుంది

తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 891 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరుకుంది. బుధవారం కొత్తగా ఐదుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 225కు చేరింది.

ఇవాళ కరోనా నుంచి 137 మంది డిశ్చార్జవ్వడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,361కి చేరింది. ప్రస్తుతం 5,858 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read:తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం: రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్‌పై ఎఫెక్ట్

బుధవారం ఒక్క హైదరాబాద్‌లోనే 719 కేసులు నమోదవ్వగా... రంగారెడ్డిలో 86, మేడ్చల్ 55, ఖమ్మం 4, భద్రాద్రి 6, వరంగల్ 6, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండల్లో రెండేసి చొప్పున, కామరెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్‌లో ఒక్కో కేసు చొప్పున వెలుగుచూశాయి. 

ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ కు కరోనా సోకింది. దీంతో వారిద్దరూ కూడ చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. 

Also Read:కరోనా టెస్టు చేయలంటూ పోలీస్ స్టేషన్ లో హల్ చల్

ఈ సమయంలోనే కీలకమైన అధికారులు కరోనా బారిన పడడం కొంత ఇబ్బందిగా మారింది. దీంతో కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్ బోర్డు ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులకు కూడ కరోనా లక్షణాలు ఉన్నాయని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.ఇంటర్ ఫలితాల్లో అనుమానాలు ఉన్నవారు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. 

click me!