బాలికపై పెదనాన్న కుమారిడి అత్యాచారం, అది తెలిసి స్నేహితుడు కూడా..

By SumaBala Bukka  |  First Published Jun 24, 2022, 9:02 AM IST

పాతబస్తీలో ఓ వ్యక్తి సొంత బాబాయి కూతురి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అది తెలిసిన అతని స్నేహితుడూ అదే పని చేశాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్బం దాల్చింది. 


చాంద్రాయణగుట్ట : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. oldcityకి చెందిన 17 ఏళ్ల బాలిక నగరంలో ఉండే పెదనాన్న ఇంటికి తరచూ వెళుతూ ఉండేది. ఈ క్రమంలో ఆ బాలిక పెదనాన్న కుమారుడి కన్ను బాలిక మీద పడింది. చెల్లెలు అవుతుందని, చిన్నపిల్ల అని కూడా అతడికి గుర్తు రాలేదు. గత జనవరి నెలలో ఆ బాలికపై పెదనాన్న కుమారుడు (36) molestationకి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు కూడా ఆ minor girlను భయపెట్టి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా.. పలుమార్లు ఆ చిన్నారి మీద దారుణానికి ఒడిగట్టారు. 

ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఇద్దరూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక ఆరోగ్యం కాస్త నలతగా ఉండటంతో… ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆరు నెలల గర్భవతి అని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది.  పెదనాన్న కుమారుడు, అతని స్నేహితుడు పలుమార్లు  అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

Latest Videos

undefined

తమ్ముళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్న.. అతడికీ అంటుకున్న మంటలు.. చివరికి..

కాగా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తన భర్తను తాగుడుకు బానిస అయ్యేలా చేయడంతోపాటు.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే తామిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. ఓ లేఖ కూడా రాశారు.

పోలీసుల కథనం ప్రకారం… ‘నా చావుకు, నా భర్త చావు కారణం షేక్ ఇలియాజ్.. నా భర్తను తాగుడికి బానిస అయ్యేలా చేశాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి సృహ తప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మేము ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతనికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం’ అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది. 

ఆ తర్వాత దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. నిందుతుడు వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేసిందీ వెల్లడించారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!