బాబాయ్, కూతుళ్లు ప్రేమికులైతే..

sivanagaprasad kodati |  
Published : Oct 17, 2018, 10:31 AM IST
బాబాయ్, కూతుళ్లు ప్రేమికులైతే..

సారాంశం

వరుసకు తండ్రి అయ్యే బాబాయ్‌పై మనసు పడింది. అతను కూడా విచక్షణ మరిచి కూతురుతో ప్రేమాయణం సాగించాడు. సభ్య సమాజం హర్షించని ఈ ప్రేమ చివరికి విషాదాంతమైంది. 

వరుసకు తండ్రి అయ్యే బాబాయ్‌పై మనసు పడింది. అతను కూడా విచక్షణ మరిచి కూతురుతో ప్రేమాయణం సాగించాడు. సభ్య సమాజం హర్షించని ఈ ప్రేమ చివరికి విషాదాంతమైంది.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం బోయిన్‌గుట్ట తండాకు చెందిన నేనావల్ మంగమ్మ, రఘు దంపతుల కుమార్తె రేణుక ఎనిమిదో తరగతి చదివింది. అదే గ్రామానికి చెందిన రాజు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను రేణుకకు బాబాయ్ వరుస అవుతాడు.

రోజు ఇంటికి వస్తూ పోతూ ఉండటంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో గత ఏప్రిల్‌లో ఎవరికీ తెలియకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీనిపై రేణుక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజుపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

వారిని హైదరాబాద్‌లో వెతికి పట్టుకుని బాలికకు సర్దిచెప్పి రాజును జైలుకు తరలించారు. రెండు నెలల క్రితం విడుదలైన రాజు.. మళ్లీ రేణుకతో మాట్లాడటంతో ఆమె తల్లి మందలించింది. దీనికి మనస్తాపం చెందిన రేణుక ఈ నెల 12న పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

దీనిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం బాలిక మరణించింది. రాజు కారణంగా తమ బిడ్డ ఇంతటి ఆఘాయిత్యానికి పాల్పడిందంటూ రేణుక బంధువులు, అతని కుటుంబంతో గొడవకు దిగారు.

తన ప్రియురాలు ఇక లేదని దిగ్భ్రాంతికి గురైన రాజు మంగళవారం తానూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజును.. రేణుక కుటుంబసభ్యులే అతడిని హత్య చేశారని ఆరోపిస్తూ అతడి బంధువులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం