రాహుల్ కు భయపడటమా, గట్స్ ఉన్నోడిని గెలుపు మాదే:కేసీఆర్

By Nagaraju TFirst Published Oct 16, 2018, 8:02 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ సభలను చూస్తే తనకు భయం అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి భయపడతానా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు తెచ్చిందే తాను అని, గట్స్ లేనోడు ఎన్నికలు తెస్తాడా అని నిలదీశారు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ సభలను చూస్తే తనకు భయం అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి భయపడతానా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు తెచ్చిందే తాను అని, గట్స్ లేనోడు ఎన్నికలు తెస్తాడా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపు తథ్యమని అన్ని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయని తెలిపారు. అయితే 100 సీట్లు దాటడమే తమ ప్రయత్నం అని కేసీఆర్ స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో నాలుగైదు జిల్లాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ లీడింగ్ పార్టీ కాబోతుందన్నారు. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలిచామన్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి అంటే ఒకప్పుడు గౌరవం ఉండేదని, అయితే ఇప్పుడు ఏమాత్రం లేదన్నారు.

జైపాల్ రెడ్డి వయసు అయిపోయిందని, అనవసరంగా నోరు జారుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు రాష్ట్రంలో అవినీతి జరిగి ఉంటే ఈ గ్రోత్ రాదన్నారు. అటు బీజేపీపైనా కేసీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో అసలు బీజేపీ ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా దక్కదన్నారు.

డిసెంబర్ వరకు వేచి చూడండని సవాల్ విసిరారు. డిసెంబర్ లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అప్పుడు గెడ్డం గీయించుకునేవాడెవడో.....ఉంచుకునేవాడెవడో తేలుతుందన్నారు. సీపీఐ నారాయణ మాత్రం కౌంటింగ్ రోజు ఉండొదన్నారు. 

click me!