కాంగ్రెస్ హమీలే మక్కీకి మక్కి....టీఆర్ఎస్ మేనిపెస్టోపై ఉత్తమ్ ఇంకా ఏమన్నారంటే...

Published : Oct 16, 2018, 08:53 PM ISTUpdated : Oct 16, 2018, 08:54 PM IST
కాంగ్రెస్ హమీలే మక్కీకి మక్కి....టీఆర్ఎస్ మేనిపెస్టోపై ఉత్తమ్ ఇంకా ఏమన్నారంటే...

సారాంశం

టీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన మేనిపెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలనే మక్కీకి మక్కీ కాఫీ కొట్టారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ తెలిపారు. ఇలా మా పథకాలను కాపీకొట్టడం ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ విజయాన్ని కేసీఆర్ ఒప్పుకున్నట్లయిందన్నారు. ఈ మేనిపెస్టో ప్రకటన ద్వారా టీఆర్ఎస్ మునిగిపోతున్న నౌక అని కేసీఆర్ చెప్పకనే చెప్పారని ఉత్తమ్ ఎద్దెవా చేశారు.   

నిరుద్యోగ భృతి ప్రకటించిన రోజున మంత్రి కేటీఆర్ మమ్మల్ని విమర్శించారు. అయితే ఇప్పుడు అవే పథకాలను టీఆర్ఎస్ పార్టీ మేనిపెస్టోలో పొందుపర్చారు. ముఖ్యంగా నిరుద్యోగ బృతి ప్రకటన గురించి పలు సందర్భాల్లో కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలు నెరవేరాలంటే  దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్లన్ని కలిపినా సరిపోవని కేటీఆర్ ఎద్దేవా చేశారని ఉత్తమ్ గుర్తు చేశారు. మా హామీలు తప్పని చెప్పిన కేటీఆర్ ఇప్పుడేం చెబుతారని ఉత్తమ్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పెన్షన్లనే కేసీఆర్ ప్రకటించారన్నారు. గతంలో రుణమాపీ వడ్డీ భారాన్ని భరిస్తానని చెప్పి కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదని ఉత్తమ్ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని అన్నారు. ఇలా తెలంగాణ రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన కేసిఆర్ వారికి క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకు మనిషికి 7 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని... దళితులకు, గిరిజనులకు తొమ్మిది రకాల రేషన్ వస్తువులు ఉచితంగా అందిస్తామని ఉత్తమ్ మరోసారి గుర్తుచేశారు.  

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్