Hyderabad : పేరెంట్స్ మొబైల్ చూడొద్దన్నారని... 13 ఏళ్ల బాలిక సూసైడ్

By Arun Kumar P  |  First Published Sep 17, 2023, 2:34 PM IST

మొబైల్ కు బానిసైన ఓ బాలిక తల్లిదండ్రులు మందలించారని  ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 


హైదరాబాద్ : సెల్ ఫోన్... ప్రస్తుతం ప్రతిఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. చిన్నా పెద్దా అని తేడాలేదు... ప్రతి ఒక్కరూ మొబైల్ కు బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే అది లేకుంటే చచ్చిపోయేంతలా. ఇలా తల్లిదండ్రులు మొబైల్ వాడకం తగ్గించాలని మందలించారని ఓ 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న దారుణం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వెలుగుచూసింది. 

బాలిక సూసైడ్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన సంజీబ్ మండల్ ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వలసవచ్చారు. నగరంలో ఎలక్ట్రీషన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నూర్ నగర్ లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. 

Latest Videos

undefined

సంజీబ్ కూతురు ఇషికా మండల్ స్థానికంగా వున్న ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుకుంటోంది. అయితే చదువుపై శ్రద్ద తగ్గించి ఎప్పుడూ సెల్ ఫోన్ పట్టుకుని వుంటున్న కూతురును తల్లిదండ్రులు మందలించారు. ఇంతదానికే ఇషికా దారుణ నిర్ణయం తీసుకుంది. 

Read More  ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్ప‌త్రిలో బాలిక‌పై అత్యాచారం.. కేసు న‌మోదు

గత శుక్రవారం తల్లిదండ్రులు మందలించిన తర్వాత గదిలోకి వెళ్లిన ఇషికా ఎంతకూ బయటకురాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపుతట్టగా లోపలినుండి ఎలాంటి స్పందన లేదు. కంగారుపడిపోయిన వాళ్లు బలవంతంగా తలుపుతెరిచి చూడగా కూతురు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఉరేసుకుని చాలాసేపు కావడంతో ఇషికా ప్రాణాలు కోల్పోయింది. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

తండ్రి సంజీబ్ పిర్యాదుమేరకు బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇషికా మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బాలిక సూసైడ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!