సైదిరెడ్డిదే విజయం.. కార్యకర్తలకు ధన్యవాదాలు: కేటీఆర్

Published : Oct 21, 2019, 06:16 PM ISTUpdated : Oct 21, 2019, 08:31 PM IST
సైదిరెడ్డిదే విజయం.. కార్యకర్తలకు ధన్యవాదాలు: కేటీఆర్

సారాంశం

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌దే విజయమన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌దే విజయమన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఉపఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎంతగానో కష్టపడ్డాయని.. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సైదిరెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నట్లు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల కంటే భారీగా నమోదు అయ్యింది. మధ్యాహ్నాం 3 గంటలకే 70 శాతం పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ 83 శాతం నమోదు అయ్యింది. 

హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 

ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల కంటే భారీగా నమోదు అయ్యింది. మధ్యాహ్నాం 3 గంటలకే 70 శాతం పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ 83 శాతం నమోదు అయ్యింది. 

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటికీ క్యూలో అనేక మంది ఓటర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే 5 గంటల వరకు క్యూలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు వేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. 

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈవీఎంలను హుజూర్ నగర్ తరలిస్తారు. అక్కడ నుంచి సూర్యాపేటకు ఈవీఎం, వీవీప్యాడ్ లను ఎన్నికల సిబ్బంది తరలించనున్నారు. ఇకపోతే ఈ ఉపఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఈనెల 24న జరగనుంది. 

అయితే ఈ ఉపఎన్నికల్లో నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం జరిగింది. గెలుపుపై అటు అధికార టీఆర్ఎస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. గెలుపు తనదేనని ఉత్తమ్ పద్మావతి రెడ్డి చెప్తుండగా ఈసారి విజయం నాదేనంటున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. మరి ఎవరు గెలిచారో ఓటర్లు ఎవరికి పట్టంకట్టనున్నారో తెలియాలంటే ఈనెల 24 వరకు వేచి చూడాల్సిందే. 

ఇకపోతే ఈ ఎన్నికల్లో మెుత్తం 28 మంది అభ్యర్థులు పోటీపడగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నారు. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు.  

హుజూర్ నగర్ ఉప ఎన్నిక గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మళ్లీ హుజూర్ నగర్ ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. 

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఈ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారం రోజులకు పైగా అక్కడే తిష్టవేశారు. 

Also Read: కొంప ముంచేనా...?: ముగిసిన హుజూర్ నగర్ పోలింగ్, 83శాతం నమోదు

ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ సైతం హుజూర్ నగర్ ను తమ ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తోంది. హుజూర్ నగర్ పై కన్నేసిన గులాబీ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలను అక్కడకు పంపారు. టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ ఉప ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యే నెలకొంది. ఇకపోతే ఉదయం నుంచి హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. సమయం అయిపోయిన తర్వాత కూడా ప్రజలు పోలిగ్ బూత్ ల దగ్గర బారులు తీరి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్