షైన్ ఆసుపత్రిపై ఈటల సీరియస్: కమిటీ ఏర్పాటుకు ఆదేశం

By narsimha lodeFirst Published Oct 21, 2019, 5:56 PM IST
Highlights

హైద్రాబాద్ ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై కమిటీని ఏర్పాటు  చేయాలని ఆదేశించారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ ఎల్బీనగర్ షైన్ ఆసుపత్రి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖాధికారులను ఆదేశించారు. షైన్ ఆసుపత్రిలో సోమవారం నాడు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు మాసాల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే.

షైన్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖఆదికారులను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.షైన్ ఆసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని  మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది.

వైద్య ఆరోగ్యశాఖాధికారులు షైన్ ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు షైన్  ఆసుపత్రికి జీహెచ్‌ఎంసీ అధికారులు కూడ నోటీసులు జారీ చేశారు.

షైన్ ఆసుపత్రికి ఫైర్ లైసెన్స్ ను రెన్యువల్ చేయలేదు.  ఈ విషయాన్ని సోమవారం నాడు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు.ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 
 

click me!