దేశ రైతాంగం KCR కోసం ఎదురుచూస్తుంది.. వేముల ప్రశాంత్ రెడ్డి.. కేంద్రానికి లేఖ...

By SumaBala BukkaFirst Published Jan 14, 2022, 1:41 PM IST
Highlights

ఎద్దు ఏడ్చిన ఎవుసం- రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగు పడవని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి K. Chandrasekhar Rao గారు ఉద్యమ ప్రస్థానం నుంచి తరచూ ప్రస్తావిస్తారు. ఆయనకు వ్యవసాయమన్న ,రైతులన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమలో భాగంగానే ఎన్నో వేల గంటల మేధో మథనంలోంచి పుట్టినవే రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు.

హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న BJP government రైతులపై చేస్తున్న ముప్పేట దాడిపై రాష్ట్ర మంత్రి Vemula Prashant Reddy తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపి వైఖరిని ప్రశ్నిస్తూ శుక్రవారం letterను విడుదల చేశారు.
                        
లేఖ పూర్తి సారాంశం:
ఎద్దు ఏడ్చిన ఎవుసం- రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగు పడవని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి K. Chandrasekhar Rao గారు ఉద్యమ ప్రస్థానం నుంచి తరచూ ప్రస్తావిస్తారు. ఆయనకు వ్యవసాయమన్న ,రైతులన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమలో భాగంగానే ఎన్నో వేల గంటల మేధో మథనంలోంచి పుట్టినవే రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులు.

ఈ నూతన సంస్కరణలతో రాష్ట్ర Agriculture రూపమే పూర్తిగా మారిపోయింది. కరువుతో అల్లాడిన నేల నేడు పచ్చని పైరులతో, ధాన్యపు రాశులతో కళకళలాడుతోంది. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఆనతి కాలంలోనే అవతరించింది. తెలంగాణ రైతాంగాన్ని దేశానికే దిక్సూచిగా మలచాలన్న గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆశయం, వారి అపార కృషి, పట్టుదల కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. 

కానీ...రైతులను ఆదుకోవడంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతును అరిగోస పెడుతున్నది. తమ కార్పొరేట్ మిత్ర శక్తుల ప్రయోజనం కోసం దేశ వ్యవసాయాన్ని,అన్న దాత బ్రతుకును తాకట్టు పెడుతున్నది. రైతులను కూలీలుగా మార్చే కుట్రలకు తెరతీసింది. భవిష్యత్ లో వ్యవసాయం కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్లి, వారు చెప్పిన ధరకు, వారు చెప్పిన రీతిలో ప్రమాదకరమైన వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

ఇందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే నిదర్శనం.పంట మద్దతు ధర పై స్పష్టత నివ్వరు.వ్యవసాయ పనిముట్ల రేట్లు పెంచి ట్యాక్స్ లు వేస్తారు.పండగలపూట ఎరువుల ధరలు 3 నెలల కాలంలోనే 50% నుండి 100% వరకు  పెంచి రైతుల కళ్లల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు.ప్రశ్నించిన రైతులను తొక్కి చంపుతున్నారు.  వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి రైతును పూర్తి అగాధంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

స్వామినాథన్ కమిషన్ సూచనలను తుంగలో తొక్కారు. దీనిపై దేశ రైతాంగంతో పాటు తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. మోసపోతే-గోస పడతాం.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దుర్మార్గపు చర్యలను రైతులు ఎక్కడికక్కడ కథనాయకులై రైతు వ్యతిరేక బిజెపి ని నిలదీయాలి. రైతు ప్రయోజనాలపై ప్రగల్భాలు పలుకుతూ,విద్వేషాలు రెచ్చగొడుతున్న స్థానిక బీజేపీ నాయకులను ప్రశ్నించాలి.వీరు కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న రైతు వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి గందరగోళ పరుస్తున్నారు.

స్వరాష్ట్ర రైతుల ప్రయోజనాలు తమ స్వార్ధ రాజకీయాల కోసం కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన వీరు రాష్ట్రానికి ప్రథమ ద్రోహులు.తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనేందుకు వీరికి మనసొప్పదు. తెలంగాణ రైతుల పట్ల బిజెపి నిర్లక్ష్యపు వైఖరి ఢిల్లీ వేదికగా నేను స్వయంగా చూసాను.మా రాష్ట్ర పంట కొనుగోలు చేయాలని మంత్రుల బృందం ఢిల్లీలో పడిగాపులు కాసింది.నేను బృందంలో సభ్యుడిగా కేంద్రాన్ని మన రాష్ట్ర హక్కును ప్రశ్నించాను.

కానీ వారు రాష్ట్రంలోని వ్యవసాయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని అర్ధమయ్యింది. రాజకీయం మాతో చేయండి రైతులతో కాదు అని మా అధినేత కేసీఆర్ ఇప్పటికే బిజెపి వైఖరి పట్ల హెచ్చరించారు. ఇవన్నీ ఇలా ఉండగా.. రైతుల పంట చేతికి వచ్చి సంతోషంగా ఉండే పండుగ పూట ఎరువుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం రైతులపై వారి అక్కసును వెళ్లగక్కింది. రాష్ట్ర BJP నాయకులు పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని తమ కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్ చేయాలి.

రైతుల ప్రయోజనం కోసం కేంద్రంలోని బిజెపి చేసింది శూన్యం.దీన్ని ఎవరూ సహించే ప్రసక్తే లేదు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిందే అని డిమాండ్ చేస్తున్న.బిజెపి రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర రైతన్నలు ఆలోచన చేయాలని,పోరాటానికి సిద్ధం కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న. దేశ రైతాంగం రైతు బంధువు అయిన KCR కోసం ఎదురుచూస్తుంది జాతీయ స్థాయిలో  - BJP ప్రభుత్వంపై మరో రైతు ఉద్యమానికి నాంది పడబోతుంది... అంటూ లేఖలో రాసుకొచ్చారు.. వేముల ప్రశాంత్ రెడ్డి.
 

click me!