
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో (shamshabad airport) స్పైస్‌జెట్ విమానం (spicejet flight) అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. శుక్రవారం ఉదయం స్పైస్ జెట్ విమానం 7. 45 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరింది. అయితే తిరుపతి విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు వల్ల ఏటీసీ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విమానం తిరిగి హైదరాబాద్‌కు వచ్చి ల్యాండ్ అయింది.