కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నతలసాని

By sivanagaprasad KodatiFirst Published Aug 24, 2018, 1:50 PM IST
Highlights

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పిలుపునిచ్చారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని విక్టోరియాగంజ్, బన్సీలాల్ పేట డివిజన్ లోని చాచా నెహ్రూనగర్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాలను మంత్రి తలసాని సందర్శించారు. విక్టోరియాగంజ్ శిబిరంలో కంటిపరీక్షలు చేయించుకున్నారు. 

హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పిలుపునిచ్చారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని విక్టోరియాగంజ్, బన్సీలాల్ పేట డివిజన్ లోని చాచా నెహ్రూనగర్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాలను మంత్రి తలసాని సందర్శించారు. విక్టోరియాగంజ్ శిబిరంలో కంటిపరీక్షలు చేయించుకున్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం జనవరి నెలవరకు కొనసాగుతుందని తెలిపారు. కంటివెలుగు శిబిరంలో ఉచితంగా వైద్యపరీక్షలు చేయడమే కాకుండా మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు

అంతేకాకుండా ఉచిత కంటి ఆపరేషన్లు కూడా చేస్తారన్నారు.  ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా చాలా మంది కంటికి సంబంధించి సరైన చికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. శిబిరంలో అందుతున్న సేవలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

click me!