టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తలకు ప్రమాద భీమా , ఎంతో తెలుసా?

By Arun Kumar PFirst Published Aug 24, 2018, 1:46 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించింది. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామని హరీష్ తెలిపారు.
 
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దానబోయిన లక్ష్మీ స్కూటీపై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయింది. అయితే ఈమెకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద భీమా వర్తించింది. ఇందుకు సంబంధించి రెండు లక్షల చెక్కును మంత్రి హరీష్ రావు మృతురాలి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ భీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి ₹2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలో 18 మంది కార్యకర్తల కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ చెక్కులు అందించామని, కొత్తగా మరో ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా మంజూరు అయిందన్నారు. 

click me!