మన ఇలవేల్పు కొమరవెల్లి మల్లన్న స్వరూపమే కేసీఆర్..: తలసాని శ్రీనివాస్ యాదవ్

By Arun Kumar PFirst Published Jul 22, 2021, 3:32 PM IST
Highlights

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని గొల్ల కురుమలకు గొర్లను పంపిణీ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు మంత్రి. 

హుజురాబాద్: యాదవులు ఇలవేల్పుగా కొలిసే కొమురవెల్లి మల్లన్న, కురుమలు కొలిచే బీరన్న స్వరూపమే ముఖ్యమంత్రి కెసిఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. గొల్ల కురుమలు అభివృద్ధి చెందాలని కేసీఆర్ నిత్యం తాపత్రయ పడుతున్నాడని అన్నారు. ఇటీవల కొకాపేట్ లో రూ.60 కోట్లు పలికిన భూమి పక్కనే గొల్ల కురుమలకు 5ఎకరాల భూమి కేటాయించడమే అందుకు నిదర్శనమని మంత్రి తలసాని తెలిపారు.  

హుజురాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో నిర్వహించిన రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే కులవృత్తులను పెంపొందించాలని చెప్పింది కేసీఆరే అని అన్నారు. 

''గ్రామాల్లో మొబైల్ పశు వైద్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఇటీవల గొర్రెల యూనిట్ కోసం డిడి ల పెంపు సాధారణ విషయమే... గొల్ల కురుమలు అధైర్య పడవద్దు. డిడి లపెంపుతో తలెత్తుతున్న ఇబ్బందులు ముఖ్య మంత్రి దృష్టికి తీసికెలతాం. అందరికీ గోర్లు వచ్చే విధంగా చూస్తాం'' అని భరోసా ఇచ్చారు. 

read more  #GiftASmile: కేటీఆర్ ఉదారత... తన పుట్టినరోజున దివ్యాంగులకు అదిరిపోయే గిప్ట్

''ఎక్కడ గొర్లు కొనుగోలు కేంద్రాలు వుంటే అక్కడికి వెళ్లి కొనుక్కోండి. గతంలో గొర్ల కొనుగోలులో తలెత్తిన సమస్యలు ఇప్పుడు ఉండవు.  డిడి లు కట్టిన గొర్ల కురుమలు రేపే వెళ్లి కేటాయించిన కేంద్రాలలో గొర్లు తీసుకోవచ్చు'' అన్నారు. . 

 అయితే ఈ కార్యక్రమంలో మంత్రి  రాకముందు రసాభాస సాగింది, మంత్రులు రాకముందే నాయకులతో గొర్రెల కోసం గొడవకు దిగారు గొర్ల పెంపకం దారులు. అధికారులు కమిషన్ కోసమే ఇతర రాష్ట్రాలనుండి గొర్లు తెస్తున్నారని... ఇలాంటి సబ్సిడీ గొర్లు వద్దంటూ గొర్ల పెంపకం దారులు ఆందోళన చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి తెచ్చే గోర్లు ఇక్కడి వాతావరణానికి తట్టుకోక చనిపోతున్నాయంటూ ఆరోపించారు.  
 

click me!