సీఎం పరిధిలో ఉన్నాయి: బండి సంజయ్ కు మంత్రి తలసాని కౌంటర్

By Siva KodatiFirst Published May 1, 2021, 5:38 PM IST
Highlights

కరోనా నియంత్రణకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని తలసాని వెల్లడించారు.

కరోనా నియంత్రణకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని తలసాని వెల్లడించారు.

ఆరోగ్యశాఖనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు తన దగ్గర పెట్టుకున్నారని తలసాని స్పష్టం చేశారు. ఇంతకంటే శ్రద్ధ తీసుకోవడం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. పరిస్ధితులను బట్టి నిర్ణయాలు వుంటాయన్న తలసాని.. జరుగుతున్న పరిణామాలు సీఎం కేసీఆర్ పరిధిలో వున్నాయని స్పష్టం చేశారు.

బండి సంజయ్ సత్య హరిశ్చంద్రుడా అంటూ శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని మంత్రి డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రుల విష‌యంలో బీజేపీ ఎంపీల వ్యాఖ్య‌లు దారుణంగా ఉన్నాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు.

Also Read:77 మందిపై భూకబ్జా ఆరోపణలు: కేసీఆర్ ను ఉతికి ఆరేసిన బండి సంజయ్

క‌రోనా క‌ట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యారోగ్య శాఖ‌పై సీఎం కేసీఆర్ మానిట‌రింగ్ చేస్తున్నారు అని స్ప‌ష్టం చేశారు. కానీ బీజేపీ ఎంపీలు మాత్రం ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు.

క‌రోనా విష‌యంలో దేశం అత‌లాకుత‌లం అవుతోందని దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏం జ‌రుగుతుందో ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారని తలసాని చెప్పారు. అక్క‌డ ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బాగుండ‌దు. జాగ్ర‌త్త‌గా మాట్లాడితే మంచిద‌ని బండి సంజ‌య్‌ను తలసాని హెచ్చరించారు. కరోనాతో బాధపడుతున్నా సీఎం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై బండి సంజయ్ ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. 

click me!