బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర.. ఇదే..

By AN TeluguFirst Published Feb 17, 2021, 5:00 PM IST
Highlights

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిండు ఆరోగ్యంతో ఉండాలని, మరింత కాలం పాటు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన ను అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రార్ధించారు. 

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ముందుగా అమీర్ పేట లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమర్పించారు. 

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన అభిషేకాలు, పూజలలో మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు అమీర్ పేట లోని గురుద్వార్ లో స్థానిక మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తో కలిసి ప్రత్యేక ప్రార్ధనలను నిర్వహించారు. 

తదనంతరం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఈనెల 15 వ తేదీ నుండి నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చన ముగింపు పూజలలో, హోమాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. 

అదేవిధంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని వెస్లీ చర్చి లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల లో MLC స్టీఫెన్ సన్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. 

వీటితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, MLC ప్రభాకర్, నాంపల్లి నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి ఆనంద్ గౌడ్ లతో కలిసి నాంపల్లి లోని హజ్రత్ యూసిఫెన్ దర్గా లో చాదర్ సమర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

click me!