చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు క్షమించరు: మంత్రి తలసాని

By rajesh yFirst Published Sep 15, 2018, 3:46 PM IST
Highlights

గత నాలుగు రోజులగా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బాబ్లీ విషయంలో చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: గత నాలుగు రోజులగా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బాబ్లీ విషయంలో చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై కుట్రపన్నాయా అంటూ ధ్వజమెత్తారు.  

టీఆర్ఎస్ కుట్రపన్నితే ఆ పార్టీలోని ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎందుకు నోటీసులు వస్తాయంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలకు ఇంగిత జ్ఞానం, బుద్ది ఉందా అంటూ మండిపడ్డారు. బాబ్లీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో బాబ్లీ ఘటన జరిగిందని... ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడితే దానికి టీఆర్ఎస్ బాధ్యులను చేస్తారా అంటూ మండిపడ్డారు. 

ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తో టీడీపీల పొత్తు పెట్టుకుందని దుయ్యబుట్టారు. చంద్రబాబును ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటికీ క్షమించరన్నారు. పొత్తు పర్యవసానాలు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అనుభవిస్తారని తెలిపారు. 

click me!